వీకెండ్ పార్టీ (A small Journey) షూటింగ్ ప్రారంభం

Weekenparty (Asmall journey) telugu movie opening
Spread the love

బాహుబలి ప్రభాకర్, రమ్యరాజ్, ప్రియ, రమ్యమణి, సిరి ప్రధాన పాత్ర ధారులుగా బి.జె. క్రియేషన్స్-ఫోర్త్ వాల్ థియేటర్ సంయుక్త నిర్వహణలో ‘వీకెండ్ పార్టీ’ (A small Journey)) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ప్రైవేట్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. మొదట జి.హెచ్.ఎం.సి రిటైర్డ్ ఎస్.ఇ దున్న యాదగిరి స్క్రిప్ట్ ను దర్శక,నిర్మాతలకు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జరిగిన ‘వీకెండ్ పార్టీ’ షూటింగ్ ముహుర్తపు సన్నివేశానికి సినీ గీత రచయిత చంద్రబోస్ క్లాప్ ఇవ్వగా, V-3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు పాశం నర్సింహారెడ్డి దర్శకత్వం వహించారు.
ఈ సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత బోయ చేతన్ బాబు మాట్లాడుతూ-”ఓ యదార్థ సంఘటన ఆధారంగా అమరుడు డా. బోయ జంగయ్య రచించిన ‘అడ్డదారులు’ అనే కథను నేటితరానికి అనుగుణంగా మార్పు-చేర్పులతో ఈ ‘వీకెండ్ పార్టీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రానికి అమరేందర్ స్క్రీన్ ప్లే, మాటలతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ , ట్విస్ట్ లతో ఈ చిత్రం సాగుతుంది. బాహుబలి ప్రభాకర్ పాత్ర ధారుడిగా రూపొందబోయే ఈ చిత్రంలో రమ్యరాజ్, ప్రియ, రమ్యమణి, సిరి నే నలుగురు అమ్మాయిలు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. నవంబర్ 15న ప్రారంభమైన ఈ ‘వీకెండ్ పార్టీ’ చిత్రం షూటింగ్ జనవరి కల్లా మొత్తం పూర్తి చేసుకొంటుంది” అని తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బాహుబలి హరిశ్చంద్ర, డి.డి.శ్రీనివాస్, కిట్టయ్య, శరత్, శ్రీమణి, లలితారాజ్, జయనాయుడు, రమణి సిద్ధి, అక్షిత్, అంగారిష్, వెంకట్ సాయి, వంశీ, రఘు, బేబి డి. మిన్నుకృష్ణ, బాబు పునీత్ రెడ్డి నటిస్తున్న ఈ ‘వీకెండ్ పార్టీ’ చిత్రానికి కథ: అమరుడు డా. బోయ జంగయ్య, నిర్మాత: బోయ చేతన్ బాబు, సహా నిర్మాత: ఎం. రేఖ, స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: అమరేందర్, సినిమాటోగ్రఫీ: రామ్ అద్దంకి, సంగీతం: సదాచంద్ర, సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్, సదాచంద్ర, కొరియోగ్రఫీ: సుచిత్రా చంద్రబోస్, ఎడిటింగ్: ఆనంద్-వెంకట్, వి.ఎఫ్.ఎక్స్: ఆనంద్ పాతకోటి, పబ్లిసిటీ డిజైన్: లక్ష్మణ్ సిద్ధి.

Related posts

Leave a Comment