వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న గోపీచంద్‌ ‘సీటీమార్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌

aggressive Star Gopichand, Sampath Nandi, Srinivasaa Silver Screen's 'Seetimaarr' to release for Vinayaka Chavithi on September 10... Trailer launched*
Spread the love

సౌత్ కా స‌త్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగె అని స‌వాలు విసురుతున్నారు ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌. అస‌లు గోపీచంద్ ఆ రేంజ్‌లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో అర్థం చేసుకోవాలంటే సీటీమార్ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. సెప్టెంబ‌ర్ 10న బాక్సాఫీస్‌తో క‌లెక్ష‌న్స్ క‌బ‌డ్డీ ఆడ‌టానికి సిద్ధ‌మైన భారీ యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామా సీటీమార్‌.
గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో మ‌న నేష‌న‌ల్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న‌ ప్రేక్ష‌కుల‌కు ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉన్న సీటీమార్‌ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
ట్రైల‌ర్ చూస్తే..
ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయ‌ర్సా నీకు రూల్స్ తెలుసు క‌దా అని క‌బ‌డ్డీ కోచ్ గోపీచంద్‌ను సెల‌క్ట‌ర్ ప్ర‌శ్నిస్తే.. రూల్స్ ప్ర‌కారం పంపిస్తే ఆడొస్తారు సార్‌.. రూట్ లెవ‌ల్ నుంచి ఆలోచించించి పంపిస్తే పేప‌ర్లో వ‌స్తారు అని గోపీచంద్ త‌న‌దైన స్టైల్లో చెప్పిన మాస్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మవుతుంది.
త్వ‌ర‌లోనే నేష‌న‌ల్ క‌బ‌డ్డీ ఉంది.. అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది. అప్పుడు మ‌న క‌ష్టం గురించి చెబితే దేశం మొత్తం మ‌న గురించి ఆలోచిస్తుంది అని గోపీచంద్ త‌న టీమ్ స‌భ్యుల‌కు చెప్ప‌డం
మ‌న‌ల్ని కంట్రోల్ చేయ‌డానికి ఎవ‌డో వ‌స్తున్నాడంట్రా.. అనేదో సాలే కో అని పోలీస్ ఆఫీస‌ర్ త‌రుణ్ ఆరోరా పొగ‌రుగా చెప్పే డైలాగ్ దానికి కంటిన్యూగా వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్‌
ఇక్క‌డ ఆడ‌పిల్ల‌లు వేసుకునే డ్రెస్ లెంగ్త్‌ను బ‌ట్టి క్యారెక్ట‌ర్ డిసైడైపోతుంది అని రావు ర‌మేశ్ చెప్పే డైలాగ్‌లో విల‌నిజం క‌నిపిస్తుంటే..
మ‌న‌దేశంలో మ‌గాళ్లు 60 ఏళ్లు బ‌తికి చ‌చ్చిపోతున్నారు. ఆడాళ్లు 60 ఏళ్లు బ‌తుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చ‌చ్చిపోతున్నారు అని గోపీచంద్ ఊరి జ‌నాన్ని ఉద్దేశించి చెప్పే మ‌రో డైలాగ్‌లో ఎమోష‌న్ క‌నిపిస్తుంది.
క‌లాంగారు క‌ల‌లు క‌న‌మ‌న్నారు.. ప‌గ‌టి క‌ల‌లు కాదు అని త‌మ‌న్నా గోపీచంద్‌ను ఉద్దేశించి వెట‌కారంగా చెప్పే డైలాగ్..
వీడు నేతి అరిసెలు ఎక్కువ‌గా తింటున్న‌ట్లున్నాడు.. బ్యాడ్ కొల‌స్ట్రాల్ ఎక్కువైపోయింది అని రౌడీల‌తో వ‌చ్చిన రావు ర‌మేశ్ చెప్పే మ‌రో విల‌నీ డైలాగ్‌
మ‌నం ఇక్క‌డ్నుంచి వెళ్ల‌టం జ‌రిగితే క‌ప్పు కొట్టుకునే వెళ్లాలి అని త‌మ‌న్నా గోపీచంద్‌తో ఆవేశంగా చెప్పే డైలాగ్‌..
ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు గోపీచంద్ యాక్ష‌న్, క‌బడ్డీ ఆడే అమ్మాయిలు ఎంత బాగా ఆడార‌నే కొన్ని స‌న్నివేశాలు.. సీటీమార్ అనే బ్యాగ్రౌండ్‌లో వినిపించే టైటిల్ ట్రాక్ ఇవ‌న్నీ సినిమాలో యాక్ష‌న్‌, భారీత‌నంతో పాటు స్త్రీ సాధికార‌త గురించి మంచి మెసేజ్ ఉన్న‌ట్లు అనిపిస్తుంది.
గోపీచంద్ మాస్ హీరోయిజం, త‌మ‌న్నా గ్లామ‌ర్‌తో పాటు.. ఈ సినిమాలో ఆమె మంచి పెర్ఫామెన్స్ రోల్ చేసింద‌ని తెలుస్తుంది. ఇక దర్శ‌కుడు సంప‌త్ నంది.. మ‌రోసారి త‌న‌దైన మార్క్ మూవీని భారీ లెవ‌ల్లో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించాడు. ట్రైల‌ర్ ఈ రేంజ్‌లో ఉంటే ఇక వినాయ‌క చ‌వితికి సినిమా అస‌లు పండ‌గ‌తో థియేట‌ర్స్‌లో మ‌జాను అందించ‌డం ఫిక్స్‌.
న‌టీన‌టులు:
గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించిన‌ ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది.
సాంకేతిక వ‌ర్గం:
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి
బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్
స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్
సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై

Related posts

Leave a Comment