యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న యాక్షన్ డ్రామా #VT13. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ ,VFX నిపుణుడైన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగు-హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా పరిచయం చేసిన వీడియో అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ కథానాయిక. రాడార్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది. తాజాగా ఈ సినిమా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తయింది. అదే విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు”#VT13 గ్వాలియర్ షెడ్యూల్‌ను పూర్తి చేశాను! తిరిగి బేస్‌కి వచ్చాను.” అన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ IAF ఆఫీసర్‌గా కనిపించే ఫోటో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం దేశభక్తితో కూడుకున్న ఎడ్జ్ అఫ్ సీట్ ఎంటర్ టైనర్. భారతదేశం ఇప్పటివరకు చూడని భీకర వైమానిక దాడుల్లో మన వీరుల పోరాటాన్ని, వారు ఎదుర్కొనే సవాళ్లను చూపుతుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్ , సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పై సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని ఈ చిత్రానికి సహ నిర్మాత.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...