వంద కోట్ల పరుగులో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’

love story
Spread the love

యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. మంచి కథను.. నిజాయితీగా చెప్పే దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య – సాయిపల్లవి కాంబినేషన్లో మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి లవ్ స్టోరీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడింది. టీమ్ మాత్రం లవ్ స్టోరీ ఎన్ని సార్లు వాయిదా పడినా.. ఎప్పుడూ వచ్చినా విజయం మాత్రం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమైంది.
సినిమా పై ఎంత నమ్మకం ఉన్నా.. సినిమాను థియేటర్లో చూడడానికి జనాలు వస్తారా..? రారా..? అనే టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్ అన్నింటికి చెక్ పెట్టింది. రికార్డు స్ధాయి కలెక్షన్ తో దూసుకెళుతుంది. ఈ సినిమా రిలీజైన తొలి వీకెండ్ మూడు రోజుల్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. 25 కోట్లు పైగా షేర్ ని కలెక్ట్ చేయడం సంచలనం అని చెప్పాలి. ఓ వైపు కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నా జనం థియేటర్లకు వచ్చేందుకు వెనకాడలేదని కలెక్షన్స్ ను బట్టి అర్ధమౌతుంది. మజిలీ తర్వాత నాగచైతన్యకు మరో బంపర్ హిట్ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది.
చైతూ కెరీర్ బెస్ట్ ఓపెనింగులను సాధించిన ఈ చిత్రం రికార్డ్ హిట్ దిశగా దూసుకెళుతుందని అంచనా వేస్తున్నారు. 3 రోజుల్లో నైజాం- 8 కోట్లు.. సీడెడ్ -3 కోట్లకు సుమారు వసూలు చేయగా.. ఉత్తరాంధ్ర -2కోట్లు.. గుంటూరు .. ఈస్ట్ లో కోటి చొప్పున ఈ చిత్రం వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. ఓవర్సీస్ లో అయితే.. ఈ చిత్రం 6కోట్లు పైగా వసూలు చేయడం ఒక సెన్సేషన్. ఇప్పటికే 1మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. ఇంకా రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ఉప్పెన, జాతిరత్నాలు తర్వాత మళ్లీ మంచి విజయం దక్కించుకున్న చిత్రంగా లవ్ స్టోరి రికార్డులకెక్కనుంది. 50 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకెళుతున్న లవ్ స్టోరీ 100 కోట్ల దిశగా దూసుకెళుతుంది. మరి.. ఫుల్ రన్ లో లవ్ స్టోరీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Related posts

Leave a Comment