బీజేపీ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నంద గంగేష్
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ తీవ్ర ఆవేదన
(టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లో రోడ్డు విస్తరణ పనులు దక్కించుకున్న గుత్తేదారు నిర్లక్ష్యo కారణంగా ఆలేరు, రఘునాథపురం రోడ్డు విస్తరణ పనులు నిర్వహిస్తున్న సదరు గుత్తేదారు పాత రోడ్డును తవ్వి పక్కన ఉన్న వర్షపునీరు పోయే కాలువలో పోయడంతో మంగళవారం రాత్రి కురిసిన తేలికపాటి వర్షానికి ఆ నీరు పోయేదారి పూర్తిగా మూసుకొని పోవడంతో రైతుల పొలాల్లో వర్షపునీరు మోకాలు లోతు నిలిచి పోవడం వలన రైతులు వేసిన పత్తిపంట పూర్తిగా నీటిలో మునిగిపోయి పంట ఎందుకు పనికి రాకుండా మొక్కలు చనిపోయాయి అని బీజేపీ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నంద గంగేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీనివలన భూమిని నమ్ముకున్న రైతులు అప్పుసప్పు చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని దుక్కిదున్ని విత్తనాలు విత్తిన నెలరోజుల లోపు సదరు గుత్తేదారు నిర్లక్ష్య వైఖరికి ఆదిలోనే రైతులు నష్టపోయారు అని అన్నారు, రైతు ఎగ్గిడి వెంకటేష్ మాట్లాడుతూ పాతరోడ్డు తవ్వి కాలువలో పోసిన మట్టిని తొలగించి నిరుపోయే మార్గం చేయాలని పలుమార్లు విన్నానించిన పెడచెవిన పెట్టారని దీనితో పత్తి మొలకలు నీటిలో మునిగి చనిపోయాయని వాపోయారు ఈ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ మాట్లాడుతూ రైతుల పంట నష్టపోవడానికి కారణం అయినా రోడ్డుపనులను నిర్లక్ష్యం తో రెండు సంవత్సరాలనుండి నాసిరకంగా పనులు నిర్వహించిన గుత్తేదారు పై చట్టరీత్యా తీసుకుని లైసెన్స్ రద్దుచేయాలనీ ఇట్టి పనులు అప్పచెప్పిన అధికారులకు మెమోలు జరిచేసి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పనులను పరిశీలించి,తక్షణమే భవిష్యత్తు లో పంట పొలాల్లో నీరు నిలవకుండా కాలువ తవ్వాలని,అలాగే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులు పొలాలను సందర్శించి, అధికారులచే పంట నష్టం అంచనా వేయించి సంబంధిత రైతులకు పరిహారం చెల్లించాలని లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున సంబంధిత గుత్తేదారు, అధికారుల, పాలకుల కార్యాలయాలు, ఇల్లులు ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పూల హనుమంతు, రైతులు ఎగ్గిడి యాదగిరి, ఆంజనేయులు, సాయి పాల్గొన్నారు