పూర్ణ స్టార్ హీరోయిన్ కావాలని కలలుకంది. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టింది. తన కెరీర్ లో మంచి విజయాలు అందుకున్నా.. ఎందుకనో మరి సాలిడ్ ప్లాట్ ఫార్మ్ మాత్రం ఇంకా పడలేదు. కాసింత నిరాశపడుతూనే అనుకున్నది సాధించాలనే కసితో, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తోంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ దశకు చేరువవుతున్న తరుణంలో ఎంతో తెలివిగా కెరీర్ ని సరికొత్తగా డిజైన్ చేసుకుంటోంది. హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా… విభిన్న పాత్రలపై దృష్టి సారించింది. ఆ పాత్రల ద్వారా నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగానే స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించేలా చూసుకుంటోంది. తాజాగా బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’లో పూర్ణ కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటూనే సినిమా కథలో ప్రధాన భాగమైంది. ఈ అవకాశం దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. ప్రభుత్వ అధికారి పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటించగా… డిసెంబర్ 4న విడుదలైన ‘అఖండ’ భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. ఇలా బుల్లితెరపై ‘ఢీ’ జడ్జ్ గా తనకంటూ ఓ ప్రత్యేకతని చాటుకున్న ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, డిజిటల్ సీరిస్ లలో సైతం నటిస్తోంది. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో నటిస్తున్న పూర్ణ, కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు చెబుతోంది. అయితే..వెండితెరపై తనకు రావలసినంత గుర్తింపు రాలేక పోవడానికి కారణం మాత్రం కొన్ని విషయాలకు ‘నో’ చెప్పడమే అంటోంది. మరి అలా ‘నో’ చెప్పడానికి కారణమైన విషయాలేంటో మాత్రం చెప్పకుండా తెలివిగా దాటేస్తోంది. అలా ‘నో’ చెప్పడం వల్ల పూర్ణ చాలా ఆఫర్స్ ను కోల్పోవలసివచ్చిందట.. సినిమాపై తను ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ టాక్ షో లో వివరణ కూడా ఇచ్చింది. పూర్ణ తాజాగా ఓటిటి రిలీజ్ ‘3 రోజెస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘3 రోజెస్’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తో పాటు తనదైన శైలిలో కామెడీని పండించింది. ఈ సినిమాలో నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా పూర్ణ క్యారక్టర్ సాగింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేశారు. ఆమె లేడీ లాయర్ గా కోర్టు రూమ్ సన్నివేశాలలో దుమ్ముదులిపారు. దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. పూర్ణ ప్రధాన పాత్రలో ‘సుందరి’ తాజాగా తెరకెక్కింది తెలుగులో ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్యాక్ డోర్’ డిసెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది.
రూటు మార్చిన పూర్ణ!?
