యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నీలం పద్మ : వరుసగా రెండోసారి నియామకం

neelam padma still
Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నీలం పద్మను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండోసారి వరుసగా నీలం పద్మను యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ముదిరాజ్ గారికి, మరియు యు.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి నీలం పద్మ కృతజ్ఞతలు తెలిపారు. 1975లో జన్మించిన నీలం పద్మ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు ఎంతగానో శ్రమిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, టిపిసి మెంబర్ గా, యాదాద్రి భువనగిగి జిల్లా పార్లమెంటేరియన్ డెవలప్ కమిటీ మెంబర్ (దిశ)గా నీలం పద్మ అందిస్తున్నా సేవలు అనన్యసామాన్యం. 2006-11 మాజీ జెడ్పిటీసీ మెంబర్ గా, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా, నల్గొండ డిస్ట్రిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్ గా, రెండు సార్లు ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా, పంచాయత్ రాజ్ మహిళా శక్తి అభియాన్ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా నీలం పద్మ ఉన్నతమైన సేవలను అందించారు.

Related posts

Leave a Comment