సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు బెనర్జీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి “అతడు, ఆమె – ప్రియుడు” అనే టైటిల్ ఖరారు చేసారు. యండమూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అయన ఒక ఆస్ట్రోనమి ప్రొఫసర్ గా నటిస్తున్నాడు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్య క్రమాలు ప్రారంభమయ్యయి.. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ .. “…ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది. భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ” అని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో బెనర్జీ, సునీల్, కౌశల్, సుపూర్ణ తదితరులు నటిస్తున్నారు. రచన, దర్శకత్వం : యండమూరి వీరేంద్రనాద్.
Related posts
-
‘భైరవం’ టీజర్ విడుదల
Spread the love బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్... -
Trisha, Tovino Thomas, Vinay Roy starrer Identity Telugu trailer launched grandly – Film To Be Released in Telugu from 24th January
Spread the love Written & Directed by Akhil Paul, Anas Khan starring Tovino Thomas and Trisha... -
త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల
Spread the love అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్,...