డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసే యువ కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. VT 12గా గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గురువారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే మాస్క్ ధరించిన మనుషులు కొందరు ఓ రాజ భవనంలోనికి ప్రవేశించటానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో బాంబుల మోత, గన్ ఫైరింగ్ నడుమ వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో మన మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా నటిస్తున్నారు. ఎదుటి వారిని ప్రమాదాల బారి నుంచి కాపాడే రోల్‌లో వరుణ్ తేజ్ నటించటం వల్ల ఈ టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఆయన టెరిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Related posts
-
*Watch Nagesh Kukunoor’s poignant directorial ‘Daak Ghar’ on the small screen*
Spread the love _This Zee Theatre teleplay retells Rabindranath Tagore’s classic story with stirring emotion_ National Award... -
Movies, series and books based on PM Narendra Modi
Spread the love Prime Minister Modi is celebrating his 74th birthday on September 17. Here are works... -
చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి
Spread the love * జానీ మాస్టర్ కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ కేస్ విచారణ ముగిసే వరకు...