యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన ఫోకస్ మూవీ టీజర్ ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. తాజాగా ఆమె లుక్‌ను బి. సుమతి ఐపీఎస్ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుదల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
బి. సుమతి ఐపీఎస్ విడుదల చేసిన ‘ఫోకస్’ చిత్రంలోని అషురెడ్డి స్పెషల్ లుక్ పోస్టర్!!
