హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గం శనివారం బాధ్యతలు చేపట్టింది. ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో ఫలితాలను అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల రిట్నర్నింగ్ అధికారి హేమసుందర్ గుండె సంబంధ వ్యాధితో ఆస్పత్రి పాలు కాగా, ఎన్నికల ప్రక్రియను మరో రిటర్నింగ్ అధికారి రంగాచార్యులు ఆధ్వర్యంలో చేపట్టి ముగించారు. క్లబ్ అధ్యక్షులుగా వేణుగోపాల నా యుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.వనజ, కె.శ్రీకాంతరావు, సహాయ కార్యదర్శులుగా రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్‌లతో పాటు మరో పది మంది ( A.పద్మావతి, మర్యాద రమాదేవి, N. ఉమాదేవి, కస్తూరి శ్రీనివాస్, గోపరాజ్. B, V. బాపురావు, రాఘవేందర్ రెడ్డి .M, అనిల్ కుమార్. P, శ్రీనివాస్ తిగుళ్ళ, వసంత్ కుమార్.G)కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం
