బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి

Spread the love
  • బహుజన సామాజిక ఉద్యమం ఫూలే…అంబేడ్కర్ మహానీయుల మార్గంలో రావాలి
  • తమ్మడి పద్మారావు (ఉద్యమాల ఉపాధ్యాయుడు)

భారతదేశంలో మతం పేరుతో రాజ్యాన్ని ఏలుతున్నారు..
కాబట్టి వారికి ప్రజాసంక్షేమం కంటే వారి బ్రాహ్మణ మత సంక్షేమమే కావాలి.
వారి బ్రాహ్మణ మతం వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఇస్తుంది.
ఈ దేశంలో ప్రజా సంక్షేమం కావాలంటే
బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి.
బహుజనులు రాజ్యాధికారం లోకి రావాలంటే..
ఆర్య బ్రాహ్మణులచేత విడదీయబడిన వేల కులాలను ఐక్యం చేసే బహుజన సామాజిక నిర్మాణం జరగాలి.
కాబట్టి కుల సమాజాన్ని బహుజన సమాజంగా నిర్మించే సామాజిక ఉద్యమం అవసరం.
సామాజిక ఉద్యమం కుల సంఘాల వలన రాదు.
బహుజన సామాజిక ఉద్యమం ఫూలే…అంబేడ్కర్ మహానీయుల మార్గంలో రావాలి.
వేల కులాల నడుమ స్నేహ, బంధుత్వ, సహకార, సోదర భావాన్ని పెంపొందించాలి.
వేల జాతుల సంక్షేమం కోసం,
వేల జాతుల అధికారాలు, ఆస్తులు, అవకాశాలు, హక్కులు, రక్షణ, ఆత్మగౌరవం కోసం ఉద్యమం జరగాలి.
ఈ బహుజనుల సామాజిక ఉద్యమం నుండి బహుజనుల రాజ్యాధికార ఉద్యమం రావాలి.
బహుజనులు రాజ్యాధికారం లోకి వస్తేనే బహుజన సంక్షేమ రాజ్యం వస్తుందని సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలన చెబుతోంది!!
కాబట్టి బహుజన విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, కవులు, కళాకారులందరి ఫై అమాయక బహుజన రక్త బంధువులను వివిధ మతం మత్తు నుండి విముక్తి చేయవలసిన సామాజిక బాధ్యత ఉందని భావిస్తూ…
మీ బహుజన రక్త బంధువు…
జై భీమ్! జై ఫూలే!! జై

Related posts

Leave a Comment