నాగ చైతన్య-సమంతకు మళ్లీ దగ్గరవుతున్నారా!?

Nagachaithanya-Samantha
Spread the love

సమంత నుంచి విడిపోయాక నాగచైతన్య మళ్లీ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడా?.. సామ్ ను మరచిపో లేకపోతున్నాడా?.. సమంత మదర్ కు ఫోన్ చేసిన నాగ చైతన్య తన భాదంతా వెళ్లగక్కడా ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరినోటవిన్నా ఇవే ప్రశ్నలు. నాగ చైతన్య -సమంత విడిపోయారన్నవార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తెగపోస్టులు పెడుతూ హల్ చల్ సృష్టిస్తున్నారు. నాగ చైతన్యకు భార్యగా అక్కినేని ఫ్యామిలీలో ఎంటర్ అయిన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో సామ్-చైతూ జంట అప్పట్లో అందరికీ ఫేవరెట్ గా ఉండేది. వీరిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడంతో సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే.. వీరి పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. పెళ్లి పీటలెక్కి అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారనుకున్న వీళ్ల పెళ్లి మున్నాళ్ళ ముచ్చటే అయి అందర్నీనిరాశపరచింది. ముఖ్యంగా అక్కినేని అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఎంతో అన్యోన్యంగా ఉన్నఈ జంట ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోవడం వెనక ఆంతర్యమేమిటో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడంలేదు. విడాకుల అనంతరం సమంత ఎంతో బిజీగా మారి తెలుగు, తమిళం, హాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలతో బిజీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప’లో సమంత నటించిన పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి వీళ్లిద్దరి వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నాగచైతన్య సమంత మదర్ కి ఫోన్ చేసి తన మనసులోని బాధను చెప్పుకున్నట్టు అక్కినేని సన్నిహత వర్గాలు చెబుతున్నాయట. తమ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను సమంత తల్లికి వివరించి కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. సమంత నుంచి విడిపోవడం ఇష్టం లేక ఆమె తల్లితో తన బాధను నాగచైతన్య పూసగుచ్చినట్టు చెప్పినట్టు అక్కినేని కుటుంబ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంతుందో కానీ.. ఒకవేళ ఇదే గనుక నిజమైతే వీళ్ళిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ 2022వ కొత్త సంవత్సరం సామ్, నాగ చైతన్య జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే !!

Related posts

Leave a Comment