నంద‌మూరి బాల‌కృష్ణ‌ ‘అఖండ’ షూటింగ్ పూర్తి

nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Shooting Wrapped Up
nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Shooting Wrapped Up
Spread the love

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న అఖండ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసింది యూనిట్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో విడుదల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా విడుదల పోస్టర్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీదర్ షూటింగ్ విజయవంతం గా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఈ పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఈ సినిమాలో బాలయ్య‌ను ఇంతకు ముందెన్నడూ చూడని స‌రికొత్త‌పాత్ర‌లో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించ‌నున్నారు. బాలకృష్ణ యొక్క రెండు పాత్రలను పరిచయం చేస్తూ విడుద‌ల చేసిన అఖండ ఫ‌స్ట్ రోర్‌ కి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఇటీవ‌ల విడుద‌ల చేసిన మొదటి పాట సంగీత ప్రియులను ఆక‌ట్టుకుంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి. రాం ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర రావు ఎడిట‌ర్