దర్శకుడు మదన్ కన్నుమూత

director madan no more
Spread the love

‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన మదన్ (రామిగని మదన్ మోహన్ రెడ్డి) శనివారం నవంబర్ 20 తెల్లవారుజామున 1 గంట 41 నిమిషాలకి కన్నుమూశారు. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించిన మదన్ హఠాన్మరణం పాలవడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మదన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నాలగు రోజుల కిత్రం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో జన్మించిన మదన్‌ పూర్తి పేరు ఆర్‌.మదన్‌ మోహనరెడ్డి. రాజేంద్రప్రసాద్‌ హీరోగా రూపొందిన ఆ నలుగురు (2004) చిత్రంతో ఆయన రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన
పెళ్లయిన కొత్తలో(2006), చిత్రంతో దర్శకుడిగా మారారు. ఉదయ్‌కిరణ్‌ హీరోగా గుండె ఝల్లుమంది (2008), జగపతిబాబు హీరోగా ప్రవరాఖ్యుడు (2009), అనీష్‌ హీరోగా కాఫీ విత్‌ మై వైఫ్‌(2013), ఆది హీరోగా గరమ్‌ (2016) మోహన్‌బాబు హీరోగా ‘గాయత్రి’ చిత్రాలను ఆయన రూపొందించారు. మదన్ సినిమాలపై ఆసక్తితో రచయితగా ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడిగా మారి తొలుత ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రాన్ని తెరకెక్కించారు. కాఫీ విత్ మై వైఫ్, ప్రవరాఖ్యుడు, గరం, గుండె ఝల్లుమంది, గాయత్రి వంటి చిత్రాలకు దర్శకత్వం చేపట్టారు. మదన్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టి పెరిగిన ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తన విద్య పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలు ఆడటం లో మంచి ప్రావీణ్యం సంపాదించిన ఆయన తర్వాత సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ మకాం మార్చారు. అసిస్టెంట్ కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర పనిచేసిన ఆయన తర్వాత కొన్ని సినిమాలకు సహ రచయితగా వ్యవహరించారు. తెలుగులో ఆ నలుగురు అనే సినిమాతో ఆయన మొదటి సారిగా ప్రేక్షక లోకానికి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఇప్పటికీ అనేకమందికి ఫేవరెట్ ఫిలింగా ఉంటుంది. ఆ సినిమాకి ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తర్వాత పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో దర్శకుడుగా మారిన ఆయన గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి అనే సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. మోహన్ బాబుతో తీసిన గాయత్రి సినిమా మదన్ కు చివరి సినిమా. ఆ తరువాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. దర్శకుడు, రచయిత మదన్ అంత్య క్రియలు ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం లో జరుగుతాయి

Related posts

Leave a Comment