తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ గారు 19-04-2022 వ తేదీన స్వర్గస్థులైనందున, ఈ విషయమై 27-04-2022 వ తేదీన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఫిలిం ఛాంబర్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షులైన శ్రీ కొల్లి రామకృష్ణ గారిని (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్), తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ కొల్లి రామకృష్ణ గారి పదవీకాలం 31-07-2022 వ తేదీ వరకు ఉండును.
-కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఎం. రమేష్, గౌరవ కార్యదర్శులు