తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నీలం పద్మ నియమితులయ్యారు .
ఈ సందర్బంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కో -ఆర్డినేటర్ , యా దాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ తనను 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. అవి.. 1. పెద్ద పెళ్లి, 2. కరీంనగర్, 3. చొప్పదండి, 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. మానకొండూరు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి డిజిటల్ సభ్యత్వాలను అధిక సంఖ్యలో చేపడుతామని అన్నారు. నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించి తన నియామకానికి సహకరించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి . పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారికి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగారికి వీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వం తీసుకుందామని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. కాగా తెలంగాణ కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నీలం పద్మ వెంకటస్వామిఎన్నిక పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు