బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు. అందులో 1945 ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1945 సినిమా డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా, గోపీ కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Related posts
-
Sankranthi Vasthunam movie Review: Decent family entertainer!
Spread the love (Movie: Sankranthiki Yaaam, Release: 14 January -2025, Rating: 3.75/5, Actors: Venkatesh, Meenakshi Chowdhury, Aishwarya... -
Sankranthiki Vasthunam Movie Review in Telugu : సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ : డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
Spread the love (చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం, విడుదల : 14 జనవరి -2025, రేటింగ్ : 3.75/5, నటీనటులు: వెంకటేష్,... -
Game Changer Telugu Movie Review: Emotional, Political Drama!
Spread the love The first Pan India movie to come out as a Sankranti gift is “Game...