డా. మహ్మద్ రఫీకి ‘ఇండియన్ ఐకాన్’ జాతీయ పురస్కారం

mohammed rafeeki indian icon award
Spread the love

మరొక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం డా. మహ్మద్ రఫీ అవార్డుల ర్యాక్ లో చేరింది! జాతీయ మానవ హక్కుల సంస్థ, అరుణాచల్ ప్రదేశ్ ప్రతియేటా నిర్వహించే ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించింది. ఈ నెల 27న ఢిల్లీ లీనా యాంబియెన్స్ హోటల్ కన్వెన్షన్ లో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం లో పర్యావరణం, క్రీడలు, అటవీ శాఖ మంత్రి శ్రీ మామా నతుంగ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతుల మీదుగా ఇండియన్ ఐకాన్ పురస్కారం స్వీకరించారు.
ఈ వేడుక లో వివిధ రాష్ట్రాల నుంచి లబ్ద ప్రతిష్టులను ఎంపిక చేసి ఇండియన్ ఐకాన్ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.మహ్మద్ రఫీతో పాటు ప్రముఖ సైకాలాజిస్ట్ శ్రీ బి.వి.సత్య నగేష్, జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ రేఖా గౌడ్ తెలంగాణ నుంచి ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు కార్పొరేషన్ ఐఇఎస్ ఇంచార్జ్ శ్రీ అన్నమయ్య, విశాఖ హార్టికల్చరిస్ట్ శ్రీమతి శృతి, నెల్లూరు కు చెందిన సామాజికవేత్త శ్రీ కొండూరు హరి నారాయణ రెడ్డి పురస్కారాలు అందుకున్నారు. మిగిలిన రాష్ట్రాల నుంచి రచయితలు, ఐఎఎస్, ఐ పిఎస్, పాత్రికేయులు పలువురు స్వీకరించారు.
జస్టిస్ జి.బాలకృష్ణన్, ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ మంత్రి డాక్టర్ సంజయ్ సింగ్, రాజస్థాన్ హోమ్ శాఖ మంత్రి శ్రీ కృపాకర్ సింగ్, మధ్యప్రదేశ్ కు చెందిన డిఐజి డాక్టర్ వి.ఎస్.మౌర్య, మహారాష్ట్ర నుంచి ఎంపి దీపాలీ శర్మ, ఢిల్లీ నుంచి స్వామి అభయ దాస్, ఘన హై కమిషన్ మినిస్టర్ కౌన్సెలర్ పొలిటికల్ శ్రీ ఇ.ఎన్.ఎడ్యులజి అతిధులుగా పాల్గొన్నారు.
గుజరాత్ కు చెందిన ఐజి క్రైమ్స్ డాక్టర్ రాజశ్రీ సింగ్, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ టి.ఎన్.సురేష్ కుమార్, ఆదిత్య బిర్లా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ వర్మ, ఢిల్లీ ప్రభుత్వ ఆర్ధిక శాఖ జాయింట్ కమీషనర్ శ్రీ రాకేష్ వర్మ, రైల్వే సలహా బోర్డు కమిటి మెంబర్ శ్రీమతి రిచా వశిష్ట (ముంబయి) తదితరులు అవార్డులు స్వీకరించిన వారిలో ఉండటం విశేషం. నిర్వాహక సంస్థ చైర్మన్ శ్రీ జితేంద్ర రవికుమార్ (అరుణాచల్ ప్రదేశ్), ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ చింపా (అహ్మద్ నగర్, మహారాష్ట్ర) పర్యవేక్షించారు. బెనారస్ కు చెందిన గాయని నిష్టా శర్మ, సరిగమప ఫేమ్ తరుణ్ సంగీత విభావరి ఉర్రూతలూగించింది.

Related posts

Leave a Comment