హైదరాబాద్ : జీతాభత్యాలు లేని అభద్రతతో కూడిన కొలువులో విలేఖరులు కొనసాగుతూ దీనస్థితిలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మల్లాపూర్ లోని వి.ఎన్.ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఉప్పల్ నియోజకవర్గ కమిటీ రూపొందించిన మీడియా డైరీని ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న చాలా మంది విలేఖరులు దారిద్య్రరేఖ దిగువకు చెందిన వారేనని, అయితే వారికి నీడ కల్పించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇళ్ల స్థలాల సబ్ కమిటీలో తాను సభ్యుడినని, 2007లో పట్టాలు పొందినప్పటికీ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేక పోయిన జర్నలిస్టులకు స్థలాలు అప్పగించేందుకు సబ్ కమిటీ నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఉప్పల్, కాప్రా, మేడ్చల్ నియోజకవర్గాల జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరిం చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే నగర శివారుల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఆయన భరోసానిచ్చారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ మేడ్చల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులకు షామిర్ పేటలో 2007లో ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు అందించినప్పటికీ ఇంతవరకు స్థలాలు స్వాధీనం చేయలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని విరాహత్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పోరేటర్లు ధన్ పాల్ రెడ్డి, కొత్త రామారావు, టీయుడబ్ల్యుజె మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మోతె వెంకట్ రెడ్డి, జి.బాల్ రాజ్, ఉప్పల్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శంకర్, జిల్లా నాయకులు బాల్ రాజ్, అక్బర్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి రెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Related posts
-
సురేష్ కొండేటి “అభిమాని” సినిమాకి ‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ రీ – రికార్డింగ్
Spread the love ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్... -
‘Melody Brahma’ Mani Sharma composing re-recording for suresh kondeti’s “Abhimani” Movie
Spread the love Famous film journalist and producer Suresh Kondeti is playing the lead role in... -
Sankranthi Vasthunam movie Review: Decent family entertainer!
Spread the love (Movie: Sankranthiki Yaaam, Release: 14 January -2025, Rating: 3.75/5, Actors: Venkatesh, Meenakshi Chowdhury, Aishwarya...