పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా భారీ సినిమా ‘రాధే శ్యామ్’. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా వచ్చే సంక్రాంతి రేస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా న్యూఇయర్ పెను మార్పులతో ఆరంభమయింది. అయితే.. సంక్రాంతి బరిలో ఉన్న భారీ సినిమా ‘ట్రిపుల్ ఆర్’ వాయిదా పడడంతో చిత్రసీమ షేక్ అయింది. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ వెనక్కి వెళితే.. ‘రాధే శ్యామ్’ కూడా విడుదల వాయిదా పడడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక అంశాలతో టాలీవుడ్ రగులుతుండగా ఒక కూల్ పోస్టర్ తో ‘రాధే శ్యామ్’ యూనిట్ మాత్రం సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటిస్తూ జనవరి 14 డేట్ ని ఈ పోస్టర్ లో పొందుపరిచారు. దీనితో ‘రాధే శ్యామ్’ విడుదల విషయంలో ఎలాంటి మార్పు తీసుకోవడం లేదని తెలిసిపోయింది.
జనవరి 14 ‘రాధే శ్యామ్’ విడుదలలో మార్పులేదు
