హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ఛలో ప్రేమిద్దాం
. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఇటీవల సెన్సేషనల్ డైరక్టర్ గోపిచంద్ మలినేని చేతుల మీదుగా జరిగింది. విజువల్ ట్రీట్ తో పాటు సినిమా ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందంటూ మేకర్స్ మోషన్ పోస్టర్ తో చెప్పకనే చెప్పారు. ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను గ్రాండ్ గా అతి త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం
అన్నారు.
డైరక్టర్ సురేష్ శేఖర్ రేపల్లే మాట్లాడుతూ…మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. మోషన్ పోస్టర్ కాన్సెప్ట్, విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందంటున్నారు. సినిమా కూడా ఏమాత్రం ఆడియన్స్ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. త్వరలో మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయనున్నాం
అన్నారు.
శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాటలుః సురేష్ గంగుల, దేవ్, ఎడిటింగ్: ఉపేంద్ర జక్క; ఆర్ట్ డైరక్టర్: రామాంజనేయులు; పీఆర్వో: రమేష్ చందు, నగేష్ పెట్లు, ఫైట్స్: నభా-సుబ్బు, కొరియోగ్రఫీ: వెంకట్ దీప్; సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి; నిర్మాత: ఉదయ్ కిరణ్, రచన-దర్శకత్వం: సురేష్ శేఖర్ రేపల్లె.