గాన గంధర్వుడు బాలు కన్నుమూత

Gaana Gandharva SP Balasubrahmaniam no More
Spread the love

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర అనారోగ్య కారణాలు తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌‌కేర్‌లో చేరారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. తల్లి పేరు శకుంతలమ్మ. బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి. బాలు పిల్లల పేర్లు చరణ్, పల్లవి.

శనివారం ఉదయం తామరైపాకంలో బాలు అంత్యక్రియలు జరగనున్నాయి. కోడంబాక్కం స్వగృహం నుంచి తామరైపాక్కం ఫాంహౌస్‌కు బాలు భౌతికకాయం చేరుకుంది. ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం బాలు పార్థీవదేహాన్ని ఉంచారు.

Related posts

Leave a Comment