క్యూబ్ కి చేరని ‘పుష్ప’ : మేకర్స్ కి టెన్షన్..టెన్షన్!?

Allu Arjun || Telugu Movie || Pushpa
Spread the love

అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘పుష్ప ది రైజ్’. చిత్ర విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్న మేకర్స్ ఇప్పుడు చివరి నిమిషంలో పనులన్నీ ఎంతో వేగంగా పూర్తి చేయాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయట. ఇందుకోసం దర్శకుడు సుకుమార్ అనుక్షణం కష్టపడుతూ ‘పుష్ప’ ప్రీమియర్ ప్రింట్ రెడీ చేస్తున్నారట. అయితే ఇది మళ్ళీ కొన్ని సమస్యల మూలాన క్యూబ్ కి చేరలేదని టాక్ ఒకటి వినిపించడంతో బన్నీ ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుందట. మరో వైపు ‘పుష్ప’ రాజ్ ఎంట్రీకి టోటల్ లైన్ క్లియర్ అయినట్లు మేకర్స్ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. మరి బన్నీ ఫ్యాన్స్ కి ఎందుకు టెన్షన్ అని మేకర్స్ ప్రశ్నిస్తున్నారు. పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ ఎంట్రీ అనుకున్న సమయానికి అన్ని చోట్లా ఉంటుందని ఇపుడు మేకర్స్ చెబుతుండడంతో ఫ్యాన్స్ తో పాటు, మూవీ లవర్స్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. ఈ పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరిట డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమా యూఎస్ లో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లో సూపర్ గా ఫిల్ అవుతుండటం తో చిత్ర యూనిట్ ఎంతో సంబరపడిపోతున్నారట. ప్రీమియర్స్ మరియు డే వన్ కలెక్షన్స్ తో బాగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో ఆడి పాడనుండడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహాద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నవిషయం తెలిసిందే.

Related posts

Leave a Comment