తమన్నాను అందరూ మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు లిప్‌లాక్ చేయలేదట. వాహ్.. గ్రేట్ కదా! గ్లామర్ షో విషయంలో కూడా వెనుకాడని ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఏ హీరోకి లిప్‌లాక్ మాత్రం ఇవ్వలేదు. ఇక తాజాగా తెలుగు ఓటీటీ ఆహాలో సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ షోలో పాల్గొన్న తమన్నాకు లిప్‌లాక్ ప్రశ్న ఎదురైంది. ఇందులో ‘నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ రూల్ బ్రేక్ చేస్తే.. ఎవరితో కిస్ చేయడానికి ఇష్టపడతావు..?’ అని తమన్నాని సమంత ప్రశ్నించింది. దీనికి తమన్నా ‘ఐ లైక్ టు కిస్.. విజయ్ దేవరకొండ’.. అని చెప్పడంతో ఒకటే ఈలలు, చప్పట్లు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్.. ఎవరు చూసినా విజయ్ దేవరకొండ పేరే చెబుతున్నారంటే.. రౌడీ హీరో రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘ఇప్పుడందరికీ విజయ్ దేవరకొండే కావాలి’.. అన్నట్లుగా మారిపోయింది. ఇక పూరీ ‘ఫైటర్’ తర్వాత విజయ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక తమన్నా విషయానికి వస్తే.. ఇంతకు ముందు ఆమె ఇటువంటి ప్రశ్నకే.. హృతిక్ రోషన్ పేరు చెప్పింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అయితే.. హీరొయిన్ లు అవకాశాలకోసం హీరోలను కాకా పట్టడం మామూలే కదా అంటున్నారు సినీ జనాలు.
‘ఐ లైక్ టు కిస్.. విజయ్ దేవరకొండ’ !?
