‘ఏజెంట్’ వైల్డ్ పోస్టర్ విడుదల

Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Wildest Poster Unveiled In Vijayawada To Disclose Trailer Launch Time, Akhil Jumped Off 172 Feet Building
Spread the love

నెవర్ బిఫోర్ రియల్ స్టంట్ తో ఆశ్చర్యపరిచిన అఖిల్ అక్కినేని

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఏజెంట్ ట్రైలర్ ఏప్రిల్ 18న కాకినాడలో జరిగే బిగ్ ఈవెంట్‌ లో లాంచ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు విజయవాడలో వైల్డ్ పోస్టర్ ని చాలా క్రేజీగా లాంచ్ చేసింది ఏజెంట్ టీమ్. అఖిల్ అక్కినేని పోస్టర్ లాంచ్ సందర్భంగా నెవర్ బిఫోర్ ఫీట్ చేశారు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్ స్టంట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. వైల్డ్ పోస్టర్ పోస్టర్ విషయానికి వస్తే.. అఖిల్ లుక్ మెస్మరైజ్ చేసింది. కండలు తిరిగిన శరీరంతో, ఫెరోషియస్ లుక్ తో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్ లో కనిపించడం వైల్డ్ గా వుంది. ట్రైలర్‌ని ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో అనౌన్స్ చేశారు. వైల్డ్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ట్రైలర్ డేట్, టైం లాంచ్ ఇంత వైల్డ్ గా చేశామంటే.. ట్రైలర్ ఎంత వైల్డ్ గా ఉండబోతుందో ఊహించుకోండి. 18న ట్రైలర్ లాంచ్. అందరం కాకినాడలో కలుద్దాం” అన్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు.
అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్ హాప్ తమిళ, డీవోపీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, పీఆర్వో : వంశీ-శేఖర్

Related posts

Leave a Comment