‘జబర్ధస్త్’ బ్యూటీ అనసూయ జోరు అంతా ఇంతా లేదు. ఎక్కడ చూసినా జబర్ధస్త్ గా అనసూయ ముచ్చట్లే! ఓ వైపు బుల్లితెరపై తన హొయలతో సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై తనకంటూ ఓ స్టాటజీని ఏర్పాటు చేసుకొని తన సత్తా చూపిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రధాన పాత్రలు పోషిస్తూనే మరోవైపు సహాయ పాత్రల్ని కూడా చేస్తుంది. అయితే.. తాజాగా అనసూయ తన జోరును తెలుగు, తమిళంలోనే కాదు మలయాళంలోను కొనసాగించడానికి, తనకు నచ్చిన రీతిలో సందడి చేయడానికి సిద్దమవుతోందిట. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చూపిన అభినయం ఆమె సిల్వర్ స్క్రీన్ కెరీర్‌కి బాగా ప్లస్ అయింది. ప్రస్తుతం మంచి అవకాశాలనుఅందుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’చిత్రంలో నటిస్తోంది. అనసూయ ఇటీవల సునీల్ సరసన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ‘వేదాంతం రాఘవయ్య అనే టైటిల్‌తో సునీల్ సినిమా చేస్తుండగా దీనికి సి. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉండనున్న నేపథ్యంలో ఆ క్యారక్టర్ ని చేసేందుకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇటీవల విజయ్ సేతుపతి చిత్రంతో తమిళ డెబ్యూ కూడా ఇచ్చింది అనసూయ. ఇప్పుడు మలయాళంలోను తెరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసింది. ఈ సినిమాతో అనసూయ మలయాళం డెబ్యూ కూడా ఇవ్వనుందని టాక్. కాగా, వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమాలో మమ్ముట్టి, అనసూయ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎక్కడవిన్నా’జబర్ధస్త్’ గా అనసూయ ముచ్చట్లే.. !
ఆహా..’జబర్ధస్త్’ అనసూయ జోరు!
