ఆలేరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ నూతన అధ్యక్షునిగా ఆకు బత్తిని ప్రభాకర్

aler news
Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో స్థానికంగా కె జె ఆర్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఆలేరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు భీమిడ్డి మాధవరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు తునికి దశరథ, మరియు జిల్లా కార్యదర్శి కాసులబాధ హరిబాబు, ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఆలేరు మండల నూతన అధ్యక్షునిగా ఆకు బత్తిని ప్రభాకర్ ను, ఉపాధ్యక్షునిగా గుండు మధుసూదన్, రాయపురం శ్రీను, గౌరవ సలహాదారులు వడ్డేపల్లి శీను, కొలాలింగం గౌడ్ , ప్రధాన కార్యదర్శిగా కోలా నరేష్, వెంకటదాసు హరిబాబు, కోశాధికారిగా రాయపురం శేఖర్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ నాకు సహకరించిన జిల్లా అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు అని నాకు అప్పచెప్పిన బాధ్యతను అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రాఫర్లు కౌన్సిలర్ రాయపురం నరసింహులు, కో ఆప్షన్ నెంబర్ సిసారాజేష్, గణపురం శివ, సందీప్, వేణు, తిరుమల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment