ఆలేరులో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం

Cricket
Spread the love

(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన బజరంగ్ యూత్ వారు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ప్రథమ,ద్వితీయ, జట్లకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది, ప్రథమ బహుమతి గా రాఘవాపురం గ్రామ జట్టుకు కు Rs 10016/- మరియు ట్రోఫీని ఐలన్న చేతులమీదుగా ఇవ్వడం జరిగింది, మరియు ద్వితీయ బహుమతి గా ఆలేరు కు చెందిన ఫ్రెండ్స్ లెవెల్ జట్టుకు Rs 5016/- మరియు టోపీని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు MA, ఏజాస్ చేతులమీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బండ్రు జహంగీర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కర్ర అజయ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్, భీమగాని ప్రభు, శ్రీను, టౌన్ మైనారిటీ అధ్యక్షులు MD బాబా,టౌన్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ కాసుల భాస్కర్, అంగీడి ఆంజనేయులు,వెళ్ళ నవీన్,NSUI మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్, కేతావత్ రాహుల్,జావీద్, జల్లి మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment