విశ్వవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆస్కార్ 2023 వేడుకల్లో రామ్‌చరణ్, ఉపాసన దంపతుల వస్త్రధారణ మెప్పిస్తోంది. డిజైనర్, కస్టమ్ మేడ్ ఎటైర్‌లో చూపరుల దృష్టిని ఆకర్షించారు ఈ జంట. అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల పనితనాన్ని ప్రదర్శించేలా ఉన్నాయి వారి వస్త్రాలు. ఈవెంట్ ఏదైనా ఫ్యాషన్ ప్రియులను అలరించే అంశాలు కొన్ని ఉంటాయి. 2023 ఆస్కార్ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాషన్ ప్రియులను మెప్పించే అత్యద్భుతమైన, గుర్తుంచుకోదగ్గ వస్త్రాల్లో కనిపించారు. ఆయన వస్త్రాలను ఫ్యాషన్ డిజైనర్స్ శాంతను, నిఖిల్ రూపొందించారు. ఆర్ ఆర్ ఆర్‌లో ఆయన కేరక్టర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ వస్త్రాలను డిజైన్ చేశారు. మెడాలియన్ బటన్స్, చక్రాల్లాంటి బ్రోచెస్ కాస్ట్యూమ్స్ కి స్పెషల్ అడిషన్‌లా అనిపించాయి. నిఖితా జైసింఘానీ స్టైలింగ్ చేశారు. మెగాపవర్‌స్టార్ లుక్‌కి అభిమానులే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా ఫిదా అయ్యారు. మెగా పవర్ స్టార్ ధరించిన కుర్తా, ఆయన స్టైల్లోనే ఉంటూనే, భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ ట్రెండ్‌కి అద్దంపట్టింది. వీటన్నిటికీ తోడు రెడ్ కార్పెట్ మీద తనదైన ప్రత్యేకమైన శైలిలో అలరించారు రామ్‌చరణ్. ఆయన ఫ్యాషన్ సెన్స్ కి ఫిదా అయ్యారు జనాలు.
రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కాస్ట్యూమ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. జయంతి రెడ్డి డిజైన్ చేసిన స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ శారీని ధరించారు ఉపాసన. బీనా గోయెంకా మెరుగులు దిద్దిన లిలియమ్ నెక్‌పీస్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రకృతిని పరిరక్షించాలన్న ఆలోచన ఉపాసనలో స్వతహాగా ఉంటుంది. కార్బెన్ ఫుట్‌ప్రింట్స్ తో భూమిని కలుషితం చేయకూడదన్నది ఆమె నమ్మే సిద్ధాంతం. అందుకే ఆమె యాక్సెసరీస్‌లోనూ స్క్రాప్‌తో తయారు చేసిన హ్యాండ్ మేడ్ పొట్లి చోటుచేసుకుంది. ముంబైకి చెందిన డిజైనర్ బినా గోయెంకా సిద్ధం చేసిన లిలియమ్ నెక్‌పీస్ శ్రీమతి ఉపాసనకు గ్రాండ్ లుక్ తెచ్చిపెట్టింది. దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది ఆ నెక్‌పీస్ డిజైనింగ్‌కి. సుమారు 400 కేరట్ల హై క్వాలిటీ రూబీస్, జెమ్ స్టోన్స్, ముత్యాలతో నగిషీలు దిద్దిన నగ అది. అలాంటి నగ మరొకటి ఉండదు.
అద్భుతమైన ప్రతిభావంతులను గుర్తించి, వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, అందరి ప్రశంసలు అందుకుంది ఈజంట
రంగస్థలం హీరో రామ్‌చరణ్ అకాడెమీ అవార్డుల గురించి అత్యంత గొప్పగా చెప్పారు. తాను, తన భార్య కేవలం ఈ అవార్డులకు సరదాగా రాలేదని, భారతదేశం ప్రతినిధులుగా హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. “మమ్మల్ని, మా భారతదేశాన్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు“ అని అన్నారు. ఆయన మాటలు, ఆస్కార్ ప్రాంగణంలో భారతీయతను ప్రదర్శించడంలో కలిగిన ఘనతను చాటాయి. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేడుకలో చాటుతున్నామనే ఆనందాన్ని ప్రతిబింబించాయి.