ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించా లనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం’’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’(టీఎఫ్‌పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ఆయన ఆ ప్రకటన లో “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మెలేనదని,ఈసినిమా టికెట్స్ ఆన్లైన్ అమ్మకం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం గొప్పదని.పరిశ్రమ అభివృద్ధి కి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని, ఈ ఆన్లైన్ అమ్మకాల పై ఇబ్బందులు ఉంటే కొంతమంది హీరోలకు మాత్రమే కాదని అందరూ హీరోలకు వర్తిస్తుందని ఇది ప్రజా దోపిడీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొన్న సాహసోపేత నిర్ణయమని, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం ఆన్లైన్ లో సినిమా టికెట్స్ అమ్మకం వలన విచ్చల విడి బ్లాక్ మార్కటింగ్.టాక్స్ లు కట్టకుండా ఉండే తతంగం, ఇష్ట రాజ్యము గా సినిమా లను ప్రదర్శిo చు కోవటనికి గండి పడుతుందని, పీద్ద హీరోల చిత్రలను చూడలనుకొనే సగటు పీక్షకుడు అధిక ధరలను చైల్లించి సినిమాలు చూడవలసిన అవసరం ఇక ఉండదని, హీరో ల పారితోషికం భారిగా తగ్గుటకు.నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గుటకు.. ఈ నిర్ణయం పరిశ్రమ మేలుకు ఉపయోగ పడుతుందని… చిత్ర నిర్మాణాలు కూడా పెరుగుటకు అవకాశం ఉంటుందని, త్వరలో జగన్‌గారిని కలిసి, పరిశ్రమలోని సమస్యలను వివరిస్తాం’’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయం బెష్.. : కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
