అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి గా అదరగొట్డిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ హాట్ హాట్ బ్యూటీకి మలయాళం సినిమా నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అదిరిపోయే ఛాన్సే! మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన జంటగా నటించడమంటే మాటలుకాదు.. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో సాగే ఆ సినిమా పేరు ‘భీష్మ పర్వం’. షూటింగ్ తదితర కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయబోతున్నారు. ఇటీవల `పుష్ప`లో దాక్షాయణి పాత్రలో ఆకట్టుకున్న అనసూయ అంతకు ముందు సుకుమార్ `రంగస్థలంలో రంగమ్మత్తగా పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా సిల్వర్ స్క్రీన్‌పై బిగ్ బ్రేక్‌ని పొందింది. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో దూసుకుపోతుంది. తెలుగులో పలు భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం `ఆచార్య`, `భీష్మ పర్వం`, `ఖిలాడీ`, `పక్కా కమర్షియల్`, `రంగమార్తాండ`, `దర్జా` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `ఫ్లాష్ బ్యాక్`లో కనిపించనున్న అనసూయ మలయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న `భీష్మ పర్వం`లో అలైస్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లుక్ ఆకట్టుకుంటుంది. ‘జబర్దస్త్’ షోలో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై తన మాటలతోనే గాక.. తన అందచందాలతో జనాల్ని ఆకట్టుకుంది. ఒక పక్క యాంకర్ గా చేస్తూనే మరో పక్క వెండితెర పై వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో అనసూయకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్ లో రాంచరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాత్రకి చాలా పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అనసూయకి సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. ఇటీవల మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లోనే ‘పుష్ప’ సినిమాలో ద్రాక్షాయని క్యారెక్టర్ లో అదరగొట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలవడంతో వేరే భాషల్లో కూడా అనసూయ క్యారెక్టర్ కి మంచి పేరే వచ్చింది. దీంతో అనసూయకి వేరే సినీ పరిశ్రమల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అనసూయకి మలయాళం సినిమా నుంచి వచ్చిన ఈ ఆఫర్ ఆమెకు ఒక విధమైన కిక్ ఇచ్చిందట. ఈ ‘భీష్మ పర్వం’లో అనసూయ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఇందులో అనసూయ అలిసా అనే పాత్రలో కనపించబోతోంది. ఈ పోస్టర్ లో చాలా సాధారణంగా ఉండే ఒక గృహిణి పాత్రగా కనిపిస్తుంది. ఈ సినిమాతో మలయాళంలో కూడా మంచి పేరు సంపాదించి వరుస ఛాన్సులు కొట్టేయాలని చూస్తుంది అనసూయ. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మలయాళంలో ఎంట్రీ ఇవ్వడం, అది కూడా మమ్ముట్టి సర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే మంచి ఎంట్రీ దొరకదేమో..’ అని పోస్ట్ చేసింది ఈ బ్యూటీ!!
అనసూయ భరద్వాజ్ ఆనందానికి హద్దులు లేవు!!
