అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ థియేట్రికల్ ట్రైలర్ మే 9న విడుదల

Adivi Sesh’s Pan India Film Major Theatrical Trailer On May 9th
Spread the love

డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘మేజర్’ ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో ని చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంది. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు వీడియో చూస్తే అర్ధమౌతుంది. రెండు భాషలలో విడివిడిగా చూపించిన సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా వున్నాయి. వార్, ఎటాక్, యాక్షన్, రోమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Related posts

Leave a Comment