అఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర క్రేజీ ప్రాజెక్ట్ ఏజెంట్ షూటింగ్ ప్రారంభం

akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting Begins Today
Spread the love

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిల ఫ‌స్ట్ క్రేజీ కాంబినేష‌న్‌లో హై బ‌డ్జెట్ మ‌రియు అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాల‌తో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఏజెంట్‌. ఈ సినిమాలో అఖిల్ ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నారు.
ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైందని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ప్ర‌కటించారు. అఖిల్ ఈ చిత్రంలో ఏజెంట్‌గా స‌రికొత్త రూపంలో క‌నిపించ‌నున్నాడు.
దర్శకుడు సురేందర్ రెడ్డి నిన్న జిమ్‌లో అఖిల్ బ్యాక్ పోజ్ విడుదల చేయగా, ఈ రోజు ఈ చిత్రం యొక్క కొత్త పోస్టర్ ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. కండ‌లు తిరిగిన దేహంతో స్లీవ్‌లెస్ టీ షెర్ట్‌ని పైకి ఎత్తి ఉన్నఈ పోస్ట‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అఖిల్ త‌న గ‌న్‌ని ప్యాంట్‌లో పెట్టుకోవ‌డం చూడొచ్చు.
సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం వంశీ కాంభినేష‌న్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే కాగా వారిద్ద‌రి కలయికలో మరో బ్లాక్ బస్టర్ గా ఏజెంట్‌ రూపొంద‌బోతుంది.
అఖిల్‌ లాంటి ప్రామిసింగ్ స్టార్ – సురేందర్ రెడ్డి వంటి ప్రూవ్ చేసుకున్న దర్శకుడు – వక్కంతం వంశీ లాంటి విభిన్న రచయిత మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ లాంటి సక్సెస్ ఫుల్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.
స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచ‌యం కాబోతుంది.
టాలీవుడ్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండ‌గా, రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్ర‌ఫి భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి కో- ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
తారాగ‌ణం : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
కో- ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తిదీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రికిపాటి
బ్యాన‌ర్స్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, స‌రేండ‌ర్‌-2 సినిమా
క‌థ‌: వ‌క్కంతం వంశీ,
సినిమాటోగ్ర‌ఫి: రాగూల్ హెరియన్ ధారుమాన్,
సంగీతం: త‌మ‌న్ ఎస్‌.ఎస్‌,
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి,
ఆర్ట్‌: అవినాష్ కొల్లా

Related posts

Leave a Comment