‘ఒక్కడే 1’ సెన్సార్ పూర్తి

'Only 1' sensor complete
Spread the love

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త classic గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదీక్ష సునీత, మధుమిత కథానాయికలుగా, జునైద్ షేక్ విలన్ గా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భగా చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ… ఇటీవలే సీబీఐ మాజీ డెరైక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ గారి చేతుల మీదుగా మా చిత్ర టీజర్ విడుదల చేయడం ప్రేక్షకులకు తెలిసిందే. అలాగే మా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం, సినిమా బాగుందని అప్రిషియేట్ చేయడం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. టీజర్ లోమీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్‌, ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ వయస్సులో నేను హీరోగా చేయడం ఏంటి అనుకోలేదు. మన టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. ఈ సినిమాను హిందీ, కన్నడ, తమిళ్‌, తెలుగు భాషల్లో త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఒక్కడే. ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
ఈ చిత్రానికి ఎడిటర్‌: నందమూరి హరి`యన్‌.టి.ఆర్‌, సంగీతం: రామ్‌ తవ్వా, కొరియోగ్రఫీ: సాగర్‌ వేలూరు, లిరిక్స్‌: శ్రీనివాస్‌, ఫైట్స్‌: రాజ్‌కుమార్‌, కృష్ణంరాజు, శ్యాం, కెమెరా: డి. యాదగిరి, ఆర్‌.ఆర్‌. చిన్నా (చెన్నై), వి.ఎఫ్‌.ఎక్స్‌: చందు ఆది Ê టీమ్‌, పి.ఆర్‌.ఓ: బి. వీరబాబు, డిజిటల్ నరేష్ నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.

Related posts

Leave a Comment