విశ్వక్‌సేన్‌ రిలీజ్‌ చేసిన లింగోచ్చా టీజ‌ర్

lingoccha teaser out poster
Spread the love

కేరాఫ్ ఆఫ్ కంచెర‌పాలెం చిత్రంలో జోసెఫ్‌గా నటించి వీక్షకుల్ని ఆక‌ట్టుకున్న కార్తీక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ నిర్మాత యాద‌గిరి రాజు శ్రీక‌ళ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిర్మిస్తున్న చిత్రం లింగోచ్చా (గేమ్ ఆఫ్ లవ్). ఈ చిత్రానికి ఆనంద్ బ‌డా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడు హైద‌రాబాది కావ‌టం వ‌ల‌న ఇక్క‌డ ఎంతో ఫేమ‌స్ అయిన లింగోచ్చా గేమ్ నేప‌థ్యంలో ఒక చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌ని రాసుకుని తెర‌కెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమ‌క‌థకి లింగోచ్చా అనే టైటిల్‌ని ఖ‌రారు చేయ‌టం విశేషం. ఈ టైటిల్ విన్న ప్ర‌తి ఒక్క‌రూ సౌండింగ్ కొత్తగా వుంద‌ని అన‌టం యూనిట్‌కి కొత్త ఎన‌ర్జీని ఇచ్చినట్లుగా చిత్రయూనిట్ పేర్కొన్నారు. ఇదే ఎన‌ర్జీతో లింగోచ్చా టీజ‌ర్‌ని రెడీ చేశారు. యూత్ ఫుల్ మాస్ హీరోగా ఇటీవ‌లే హ్యూజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా విజ‌య ద‌శ‌మి కానుక‌గా ఈ టీజ‌ర్‌ విడుదలైంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత యాద‌గిరి రాజు మాట్లాడుతూ.. సినిమా రంగంలో ఎప్ప‌టి నుండో వున్నాము. కానీ ఎప్పూడూ సినిమా నిర్మించాల‌ని అనుకోలేదు. లింగోచ్చా నేపథ్యంలో ఆనంద్ బ‌డా చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అలాగే ఈ క‌థకి హీరో కార్తిక్ ర‌త్నం సరిగ్గా సరిపోయాడు.. అత‌ని ఎన‌ర్జి మా సినిమాకి ప్ల‌స్ అవుతుంది. ఈ చిత్రంలో చేసిన హీరోయిన్ సుప్యార్ధ్ సింగ్ మ‌రియు అదిరింది షో స‌ద్దాం, పటాస్ బల్వీర్ సింగ్ ఇలా అంద‌రూ చాలా నేచుర‌ల్‌గా న‌టించి మెప్పించారు. ఈ టీజ‌ర్‌ని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా‌ హీరో విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా విడుద‌ల చేశాము. ఈ టీజ‌ర్ త‌ప్ప‌కుండా అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆనంద్ బ‌డా మాట్లాడుతూ.. మా నిర్మాత యాద‌గిరి రాజుగారు ఈ చిత్ర క‌థని న‌మ్మి నిర్మించినందుకు ఆనందంగా వుంది. కొన్ని యదార్థ సంఘటనలు ఇచ్చిన స్ఫూర్తితో ఈ కథని రాసుకున్నాను. లింగోచ్చా అని చెప్పినప్పుడు చాలా మంది అదేంటి అని వింతగా అడిగారు. కానీ దాని అర్ధం తెలిశాక అందరూ బావుంది అని చెప్పారు. ఇంతకీ లింగోచ్చా అంటే ఏమిటంటే.. ఏడు పెంకులాట. లాగోరి, పిటో, సెవెన్ స్టోన్స్ అని ఒక్కో చోట ఒక్కో పేరుతో ఆడతారు. అలాంటి ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాని నిర్మించిన మా నిర్మాత గారికి ధ‌న్య‌వాదాలు. అలానే ఈ చిత్ర క‌థ అనుకున్న‌ప్పుడు ఎవ‌రు స‌రిపోతారా అనే డైల‌మాలో వున్న నాకు కేరాఫ్ కంచెర‌పాలెంలో మెరుపులా మెరిశాడు కార్తీక్ ర‌త్నం. తన నాచురల్ నటనతో ధగడ్ శివ పాత్రలో చాలా బాగా చేశాడు. టీజ‌ర్‌లో ధగడ్ శివ అండ్ బాచ్ ఎన‌ర్జీని చూస్తారు. అలాగే హీరోయిన్ సుప్యార్ధ సింగ్ తన అందం అభినయంతో ఆకట్టుకొని కార్తీక్‌కి సరిజోడీగా నిలిచింది. ఇక ఒక మంచి రోల్‌లో కునాల్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చిన్నప్పటి హీరో హీరోయిన్‌లుగా నటించిన ఫిదా మొగల్, ప్రేమ్ సుమన్ వారి క్యూట్ పెరఫార్మెన్స్‌తో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. సద్దాం, బల్వీర్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, ఇస్మాయిల్ బాయ్ కామెడీ టైమింగ్‌కి థియేట‌ర్ అంతా గోల గోల పెడుతుంది. ఈ చిత్ర టీజ‌ర్‌ని మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ చేతుల మీదుగా విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేశాము. కొన్ని చిత్రాలు ఎంత బాగున్నా థియేట‌ర్ బ‌య‌ట‌కు రాగానే మ‌ర్చిపోతాం. కాని లింగోచ్చా మెమ‌రీస్ మీ ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇది మా యూనిట్ అంద‌రి నమ్మ‌కం అని అన్నారు.

https://www.youtube.com/watch?v=17BNrJvKbmw

నటీన‌టులు
కార్తీక్ ర‌త్నం, సుప్యార్దే సింగ్, బేబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్, ఉత్తేజ్, తాగుబోతు ర‌మేశ్, కునాల్ కౌశిక్‌, బ‌ల్వీర్ సింగ్, స‌ద్దామ్ హుస్సెన్‌, మిమిక్రి మూర్తి, ధీర్ చ‌ర‌ణ్, శ్రీవాస్త‌వ్‌(ఇస్మాయిల్ భాయ్), ఫిష్ వెంక‌ట్‌, రవి శంకర్, శోభారాణి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం
బ్యాన‌ర్- శ్రీక‌ళ‌ ఎంటర్టైన్మెంట్స్
స‌మ‌ర్ప‌ణ- బ్లాక్ బాక్స్ స్టూడియోస్
నిర్మాత- యాద‌గిరి రాజు
రచన, ద‌ర్శ‌క‌త్వం- ఆనంద్ బ‌డా
మాట‌లు- ఉద‌య్ మ‌దినేని
కెమెరా- రాకేశ్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్- మ‌ల్లేశ్ క‌న్జ‌ర్ల‌
లైన్ ప్రొడ్యూస‌ర్స్- సందీప్ తుమ్కుర్, శ్రీనాధ్ చౌద‌రి
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌- శ్రావ‌ణ్ మెంగ‌
పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- ఏ వెంక‌టేశ్వ‌రావు
కొరియోగ్ర‌ఫీ- భాను
మ్యూజిక్- బికాజ్ రాజ్
ఎడిటింగ్- మ్యాడీ, శ‌శిబ‌డా
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్- బాబీ గంధం
పీఆర్ఓ- ఏలూరు శ్రీను

Related posts

Leave a Comment