రాంచరణ్ తో సాయిపల్లవి!

Sai Pallavi with Ramcharan!

రామ్‌ చరణ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఓవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉంటూనే.. మరోవైపు బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో పాలు పంచుకొంటున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా సాయి పల్లవిని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది వరకు శ్రీలీల పేరు బయటకు వచ్చింది. ఆమె స్థానంలోకి సాయి పల్లవి వచ్చిందా? లేదంటే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలా? అనే సంగతి తెలియాల్సివుంది. 1980 నేపథ్యంలో సాగే పిరియాడిక్‌ చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించనున్నారు. రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చెన్నైలో ప్రస్తుతం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

అవేవీ నన్ను బాధించలేవు : అలియాభట్‌

None of that can hurt me: Alia Bhatt

రణబీర్‌కి లిప్‌స్టిక్‌ నచ్చదు. నేను వేసుకుంటే కూడా ఊరుకోడు. తీసేయ్‌మని గొడవ చేస్తాడు. ఆ విషయాన్నే ఓ ఇంటర్‌వ్యూలో చెప్పాను. దానికి పెడార్థాలు తీస్తూ రణబీర్‌ నన్ను వేధిస్తున్నాడని ఏవేవో రాసేశారు. నిజానికి రణబీర్‌ చాలామంచి మనిషి. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాపై రాసినా నేను బాధపడను. అవి నన్ను బాధించలేవుకూడా. కానీ తనపై రాశారు. అప్పుడు మాత్రం బాధ అనిపించింది’ అని అలియాభట్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె కరణ్‌జోహార్‌ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో కరీనాకపూర్‌తో కలిసి పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చేతిలో ఫోన్‌ ఉన్న ప్రతివాడూ ప్రస్తుతం జర్నలిస్టే. రూమర్లు పుట్టిస్తూనే ఉంటారు. నేను సన్నగా మారటానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోటానికి కొన్ని సర్జరీలు చేయించుకున్నానంట. ఆమధ్య ఈ వార్త సోషల్‌మీడియాలో బాగా ట్రోల్‌…

ఆయన సలహాలు వింటానంటోంది మెహరీన్‌!?

Mehreen wants to listen to his advice!?

‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాలో మెహరీన్‌ను చూసిన అందరూ కాజల్‌ చెల్లెలా? అనే అనుమానం వ్యక్తం చేశారు. బొద్దుగా, ముద్దుగా ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది మెహరీన్‌. ఆ తర్వాత ఏమైందో.. బొద్దుగా ఉంటే అవకాశాలు రావని ఎవరైనా చెప్పారేమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి తగ్గిపోయి సన్నగా తయారైంది. ఓ దశలో జీరో సైజ్‌కి మారిపోయింది కూడా. నిజానికి బొద్దుగా ఉన్నప్పుడున్న అందం సన్నబడ్డాక కనిపించడంలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ‘స్పార్క్‌ లైఫ్‌’ సినిమాలో మెహరీన్‌ అటు బొద్దుగా కాకుండా, ఇటు సన్నగా లేకుండా మధ్యస్థంగా ముద్దుగా కనిపించింది. ఇటీవలే ఆమె దర్శకుడు మారుతిని కలిసింది. మెహరీన్‌ను చూసిన మారుతీ.. ‘ఇప్పుడు చాలా బావున్నావు. నా ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాలో చాలా సన్నగా ఉన్నావు. ఇదే మెయింటెయిన్‌ చెయ్‌’ అన్నాడట. మారుతీ సలహాని పాటిస్తానని,…

సొంతంగా యూట్యూబ్‌ ప్రారంభించిన నాగచైతన్య!

Naga Chaitanya started his own YouTube!

ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ యాక్టర్‌ నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో 23 సినిమాతో బిజీగా ఉన్నాడు. చైతూ ఓ వైపు ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ను ప్రారంభించాడు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్స్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్‌ ద్వారాను ప్రేక్షకులకు చేరువలో ఉంటున్నారు. వారికి సంబంధించిన చిత్ర ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చైతూ వచ్చి చేరాడు. ‘అక్కినేని నాగచైతన్య’ పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు…

ఇప్పటి వరకు అలాంటి సీన్స్‌ చేయలేదు…!

Such a scene has not been done till now...!

‘తమిళంలో నేను పోలీస్‌ క్యారెక్టర్స్‌ చాలా చేశాను. కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారి. నా దృష్టిలో కథే హీరో. ఈ సినిమాలో పాత్రపరంగా చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను, శ్రీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ పాత్రల్లో కనిపిస్తాం. ఇద్దరిలో ఒకరు క్రిమినల్‌ అయితే ఎలా ఉంటుంది? రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయి? అనే ఆంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మలయాళ ‘నాయట్టు’కి రీమేక్‌ అయినా తెలుగులో చాలా మార్పులు చేశారు. ఈ సినిమాలో స్మోకింగ్‌ చేయడం…

కత్రీనాతో కలిసి డ్యాన్స్‌ చేసిన సల్మాన్‌!

Salman danced with Katrina!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ ప్రాంఛైజీ సినిమాలకు క్రేజ్‌ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇదే జోనర్‌లో వచ్చిన టైగర్‌ 3 మరోసారి ఈ క్రేజ్‌ను బాక్సాఫీస్‌ను రుచి చూపించింది. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం టైగర్‌ 3 . కత్రినాకైఫ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన టైగర్‌ 3 దీపావళి కానుకగా నవంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్‌ అవుతూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిల్తుస్తోంది. ఇక సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోన్న నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమాన లోకానికి ధన్యవాదాలు తెలియజేశాడు సల్మాన్‌ ఖాన్‌. ఈ నేపథ్యంలోనే టైగర్‌ టీమ్‌ అంతా ముంబయిలోని ఓ…

హ్యాపీబర్త్ డే నయన్‌.. శుభాకాంక్షల వెల్లువ!

Happy birthday Nayan.. Best wishes!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్‌కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భర్త విఘ్నేష్‌ శివన్‌ కూడా నయన్‌కి స్పెషల్‌గా విషెస్‌ తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే నయనతార. లవ్‌ యూ మై ఉయిర్‌, ఉలగం. నా జీవితం యొక్క అందం, అర్థం మీరు.. మీ సంతోషమే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్‌,…