వాహ్.. అందాల ‘నిధి’!

ATTACHMENT DETAILS Nidhhi-agerwal-stunning
Spread the love

మైమరపించే అందంతో ఇటీవల టాలీవుడ్ దృష్టిని, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి చీరకట్టులో మరిన్ని వెలుగుల్ని విరజిమ్మింది. వివరాల్లోకి వెళితే.. గల్ల అశోక్ హీరోగా నటిస్తున్న ‘హీరో’ సినిమాలో నిధి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హోటల్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు తెలిపారు. అయితే..ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ శారీలో ధగధగ మె రిసిపోయారు. తన అందంతో చూపరులను ఇట్టే కట్టిపడేసారు. 2017లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘మున్నా మైఖేల్‌’తో వెండి తెర ప్రయాణాన్ని సాగించిన అందాల తార నిధి అగర్వాల్‌.. అటు తరువాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా ద్వారా ఈ చిన్నది తన అందంతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ త‌ర్వాత అఖిల్‌ అక్కినేనితో ‘మ‌జ్ను’ అనే చిత్రంలో నటించింది. అయితే..ఈ రెండు సినిమాలు కూడా నిధికి ఏ మాత్రం మంచి కెరీర్ ని అందించలేకపోయాయి. అయితే… పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ద్వారా నిధికి మంచి ఇమేజ్ లభించింది. రామ్ సరసన నటించి నటిగా మంచి మార్కుల్ని కొట్టేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ క్రేజ్ తోనే ఆమె వరుసగా తెలుగు, తమిళ భాషల్లో ఛాన్స్ లు కొట్టేసింది. కోలీవుడ్ లో శింబు, ‘జయం’ రవి సినిమాలలో అవకాశాలు అందుకుంది. దాంతో తమిళ నాట ఈ కన్నడ సోయగానికి విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం తాజాగా ఈ కన్నడ భామ టాలీవుడ్ లో అందరి చూపు తనవైపునకు తిప్పుకుంటోంది. ఇప్పుడు తాజాగా నటిస్తున్న ‘హీరో’ చిత్రంతో పాటు మరికొన్నిసినిమాలకు నిధి సైన్ చేసింది. ఈ బ్యూటీ నటించిన సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా.. తన క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. .ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. అలాంటి హిట్ ఒకటి పడితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన నిధి చేరడం కూడా ఖాయమంటున్నారు సినీవర్గాలు.
సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తూ ఉండే నిధి అగ‌ర్వాల్ తాజాగా జరిగిన ‘హీరో’ ప్రీ రిలీజ్ వేడుకలో బ్లాక్ శారీలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. నిధి గ్లామ‌ర్ షోకి ప్ర‌తి ఒక్క‌రూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి!!

Related posts

Leave a Comment