రెండు భాగాలుగా ‘శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం’ చిత్రం : త‌న 100వ చిత్రంగా ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ప్ర‌క‌ట‌న‌

రెండు భాగాలుగా 'శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం' చిత్రం : త‌న 100వ చిత్రంగా ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ప్ర‌క‌ట‌న‌
Spread the love

అన్ని భాష‌ల వారు న‌టించ‌నున్న ఈ చిత్రం ద‌స‌రా నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌

శ్రీ‌శ్రీ‌పుట్ట‌ప‌ర్తి సాయిబాబాగారి గురించి తెలియంది కాదు. ఆయ‌న్ను భ‌క్తులు క‌దిలే దైవంగా చూస్తారు. ప్ర‌జ‌ల‌కు ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. కోట్లాది మంది భ‌క్తులు ఆయ‌న‌కున్నారు. అలాంటి స్వామి గురించి ఇప్ప‌టిత‌రానికి, రాబోయే త‌రానికి కూడా తెలియ‌జేయాల‌నే మంచి సంక‌ల్పంతో `శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం` చిత్రం వెండితెర‌కెక్క‌బోతోంది. క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అంద‌రికీ తెలిసిన ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేష‌మైతే, ఆయ‌న‌కిది 100వ చిత్రం కావ‌డం మ‌రో విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భ‌క్తులు ప్ర‌ముఖ డాక్ట‌ర్ దామోద‌ర్ నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం చిత్రంకు సంబంధించి లోగోను సోమ‌వారంనాడు ఏకాధ‌శి రోజున హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన వేడుక‌లో ముర‌ళీమోహ‌న్, సుమ‌న్‌, సి.క‌ళ్యాణ్‌ ఆవిష్క‌రించారు.
అనంత‌రం సాయి ప్ర‌కాష్ మాట్లాడుతూ, సాయికుమార్ కాంబినేష‌న్‌లో 12 సినిమాలు చేశాను. క‌ర్నాట‌క‌లో మేమిద్ద‌రం రికార్డ్‌లు చేశాం. పోలీస్ స్టోరీ ఫ‌స్ట్ వ‌ర్ష‌న్ చేశాను. సాయికుమార్ తో సెంటిమెంట్‌, డ్యూయెట్లు కూడా చేయ‌వ‌చ్చు అని `నాగ‌దేవ‌త‌` సినిమాలో చేసి చూపించాం. స్వామివారి పుట్టిన‌రోజునాడు సాయికుమార్‌గారు యాంక‌ర్‌గా కూడా చేశారు. ఆయ‌న‌కు స్వామిపై ప్రేమ వుంది. స‌బ్‌కామాలిక్ ఏక్ హై అనే వారు స్వామివారు. అలాంటి స్వామివారి సినిమా ఎలా తీస్తార‌నే సందేహం అంద‌రికీ క‌లిగింది. అన్ని కులాలు, మ‌తాలు ఒక్క‌టే అనేవారు. నా తండ్రిగారితో స్వామివారి గురించి చ‌ర్చించేవాడిని. నా తండ్రిగారు 1986లో కాలం చేశాక నా పేరున వున్న రెడ్డి తీసివేసి సాయి చేర్చుకుని జీవితం సాగించాను. అలా స‌త్య‌సాయి ద‌గ్గ‌ర‌కు నేను చేరాను. ప్ర‌తిరోజూ స్వామివారికి పాద న‌మ‌స్కారం చేసేవాడిని. అక్షింత‌లు, చాక్టట్లు భ‌క్తులు అడుగుతుంటారు. కొంద‌రు వాచ్‌లు, కారులు అడుగుతుంటారు. ఓరోజు స్వామివారు న‌న్ను ఏం కావాలి? అని అడిగితే వాచ్‌లు, కారులు వ‌ద్దుస్వామి. నాకు నీ ప్రేమ కావాలి అనిచెప్పాను. ఆ త‌ర్వాత నా గురించి తెలుసుకుని షిరిడీ సాయి బాబా ద‌ర్శ‌నం కూడా చేయించి షిర్డిసాయిబాగా సినిమా చేయాల‌ని ఆశీర్వ‌దించారు. పుట్ట‌ప‌ర్తిలో షూటింగ్ చేయాలి అంటే అన్నీ వ‌స్తాయి అని న‌న్ను చేయ‌మ‌న్నారు. స్వామివారు ఆ సినిమా చూశారు. ఆ సినిమాను 108రోజుల పండ‌గ కూడా చేశారు. అలాటిది ఇప్పుడు ఆ స్వామివారిపై సినిమా చేసే భాగ్యం క‌లిగింది. 1994లోనే స్వామివారిపై రాసిన స్క్రిప్ట్ ఇంకా మ్యూజియంలో వుంది. మ‌హాభారం, రామాయ‌ణం ఏది తీయాల‌న్నా స్వామి అనుమ‌తి కావాలి. అలా నేను షిరిడీ సాయి బాగా సినిమా చేశాను. ఈ క‌థ‌ను 1998లో తోట‌ప‌ల్లి మ‌ధుగారు రాశారు. ఆ త‌ర్వాత కోడిరామ‌కృష్ణ‌గారు చేప‌ట్టారు. కొన్ని కారణాల‌వ‌ల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు స్వామివారి ద‌య‌, భ‌క్తుల అనుగ్ర‌హంతో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఈ సినిమాను త్వ‌రగా రావాల‌ని భ‌క్తులు కోరుకుంటే వ‌స్తుంది.
స్వామివారిపై సినిమా తీస్తున్నాన‌ని ఓ సంద‌ర్భంలో డా. దామోద‌ర్‌గారికి పుట్ట‌ప‌ర్తిలో చెప్పాను. ఈ సినిమా నేనే నిర్మిస్తాన‌ని ముందుకు వ‌చ్చారు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న స్నేహితులైన డాక్ట‌ర్లంతా ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాల‌ని సంక‌ల్పించాం. బాల‌కాండ‌, మ‌హిమా కాండగా తీయ‌నున్నాం. 1925నుంచి 1949 వ‌ర‌కు ఒక భాగంగా, 1949లో ప్ర‌శాంతి నిల‌యం శంకుస్థాప‌న చేసి 50లో క‌ట్టారు. అప్ప‌టినుంచి 2011వ‌రకు మ‌రో భాగంగా వుంటుంది.
ఇందులో 150 మంది క‌ళాకారులు న‌టించ‌నున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ అన్ని భాష‌ల‌వారు పాల్గొంటారు. 180 దేశాల్లో వున్న భ‌క్తులు, భ‌క్తులుకానివారుకూడా ఈ సినిమా చూసి ఆనంద‌ప‌డేట్లుగా తీయాల‌నుకుంటున్నాం. స్వామివారు సేవ ఎంత గొప్ప‌గా చేశారో తెలియ‌జేస్తాం. ద‌స‌రా త‌ర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. ప్ర‌తి నెలా ప‌దిరోజుల‌పాటు షూటింగ్ చేయాల‌నుకుంటున్నాం. వ‌చ్చే ఏడాది స్వామివారి పుట్టిన‌రోజున విడుద‌ల చేయాల‌నే ప్లాన్‌లో వున్నాం. ఈ క‌థ‌కు భిక్ష‌ప‌తి అనువాదం చేస్తున్నారు. అంద‌రూ నా ఆప్తులే. అంద‌రి స‌హ‌కారం వుంది.
ఇప్ప‌టికి నేను సినిమారంగానికి వ‌చ్చి 50 ఏళ్ళు అయ్యాయి. నేను డా. ప్ర‌భాక‌ర్‌రెడ్డి, కోడిరామ‌కృష్ణ‌, ఆరుద్ర‌, సి. నారాయ‌ణ‌రెడ్డి వంటి వారి ద‌గ్గ‌ర ప‌నిచేశాను. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాను అని తెలిపారు.
చిత్ర నిర్మాత డా. దామోద‌ర్ మాట్లాడుతూ, డాక్ట‌ర్‌గా స్వామివారి సేవ‌లో త‌రించాను. అనుకోకుండా స్వామి వారి పుట్టిన‌రోజున క‌లిసిన సాయిప్ర‌కాష్‌గారు మాట‌ల్లో స్వామివారి సినిమా గురించి చెప్పారు. వెంట‌నే నేనే చేస్తాను అన్నాను. అమెరికాలోని డాక్ట‌ర్లంతా నాకు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. వంద సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడిగా సాయిగారితో నేను సినిమా చేయ‌డం స్వామి మ‌హిమే అని తెలిపారు.
న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ, డా. దామోద‌ర్‌గారు, సాయిప్ర‌కాష్‌గారు ఈ సినిమా తీయ‌డం చాలా అభినంద‌నీయం. గాడ్ ఈజ్ గ్రేట్‌. భ‌గ‌వంతుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో మ‌న‌కెవ్వ‌రికీ తెలీదు. ఈ సినిమాకు అంద‌రి స‌హ‌కారం కావాలి. స‌మాజానికి త‌ప్ప‌కుండా తెలియాల్సిన ల‌వ్‌, ఎఫెక్ష‌న్‌, జీవితం అంటే ఏమిటి? అనే విష‌యాలు ఈ సినిమా చూపుతుంది. క‌రోనావ‌ల్ల మ‌న‌మంతా చాలా గుణ‌పాఠాలు నేర్చుకున్నాం. ఆప్తులెవ‌రో, అయిన‌వారెవ‌రో, స్నేహితులెవ‌రో మ‌న‌కు తెలియ‌జెప్పింది. బాబాగారి గురించి అద్భుతాలు మ‌రిన్ని ఇప్ప‌టిత‌రానికి రాబోయే త‌రానికి తెలియాలి. భార‌తీయుడిగా మ‌న క‌ల్చ‌ర్ కు గౌర‌విస్తూ త‌ల్లిదండ్ర‌లుకు మ‌ర్యాద ఇవ్వ‌డం నేర్చుకోవాలి. మ‌న‌కంటూ ఓ ఫిలాస‌ఫీ వుంది. ప్ర‌తిదానిని అర్తం చేసుకోవాలి. ఇవ‌న్నీ సాయిప్ర‌కాష్‌గారు సినిమాలో చూపిస్తారని అన్నారు.
ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ, మా గురువుగారు సాయిప్ర‌కాష్‌గారు. ఆయ‌న ద‌గ్గ‌ర నేను అసిస్టెంట్‌గా చేశాను. 50 ఏళ్ళ సినీ జీవితం ఆయ‌న‌ది. 100వ సినిమాగా స్వామివారి సినిమా చేయ‌డం భ‌గ‌వంతుడు ప్ర‌సాదించిన వ‌రంగా భావిస్తున్నా. ఈ సినిమాను బాబాగారి శిష్యుడిగా బాగా తీస్తారు. దీనిని స్వామి భ‌క్తులేకుండా ప్ర‌పంచం ఆద‌రించాలి. సాయి సేవాభావంతో చేసిన శాంతి, స‌హాయం అల‌వ‌ర్చుకోవాలి. ఈ సినిమా చూశాక ప్ర‌తివారూ ఒక‌రికొక‌రు సాయం చేసుకోవాలి. ఈ విషయాన్ని మ‌న‌కు క‌రోనా ఎన్నో నేర్పింది అని తెలిపారు.
డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ, నేను ఇలా నిల‌బ‌డ‌డానికి బాబానే కార‌ణం. చిన్ప‌పుడు తేనంపేట‌కు స్వామివారు వ‌స్తుండేవారు. మా అమ్మ‌గారు బాగా గారిద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లేవారు. నేను రాన‌ని అనేవాడిని. వ‌చ్చినా గొడ‌వ చేసేవాడిని. మా అమ్మ‌ను స్వామి పిలిచి.. వాడే ఒక‌రోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు అన్నార‌ట‌. అలాంటి నాకు స్వామి పుట్టిన‌రోజుకు పుట్ట‌ప‌ర్తికి శాస్త్రిగారి ద్వారా పిల‌వ‌డం జ‌రిగింది. అప్ప‌టికీ నా పోలీస్ స్టోరీ రాలేదు. పుట్ట‌ప‌ర్తిలో స్వామివారు అంద‌రికీ బ‌ట్ట‌లు ఇచ్చారు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నీకేం బ‌ట్ట‌లు కావాల‌న్నారు. మీ ఇష్టం అన్నాను. నాకు స‌ఫారీ సూట్ ఇచ్చారు. నీకు ఐఎఎస్‌. ఐ.పి.ఎస్‌. బాగుంటుంది అన్నారు. ఈయ‌నేంటి ఇలా అంటారు. చిన్న చిన్న డ‌బ్బింగ్‌లు చెప్పుకునే నాకు ఆ మాట‌లు అర్థంకాలేదు. అమ్మ‌కు చెప్పాను. పెద్ద‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరుగా వుంటాయ‌ని చెప్పింది. ఓసారి సునీల్ గ‌వాస్క‌ర్‌తో ఓ వ్య‌క్తి వ‌చ్చారు. న‌న్ను చూడ‌గానే హ్యాపీనా! అని అడిగారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నావా! అని అడిగారు. స్వామికి లెట‌ర్ ఇవ్వు అన్ని చెప్పారు. నాకు అర్థంకాలేదు. మా అమ్మ‌ను అడిగితే కోరిక‌లు లెట‌ర్ ద్వారా తెలియ‌జేస్తారు అంది. ఓరోజు స్వామివారు న‌న్ను చూస్తూ లెట‌ర్ రాయ‌లేదే అని క‌ళ్ళ‌తో సైగ చేశారు. అయిష్టంగానే వెంట‌నే ప‌క్క‌న ఓ వ్య‌క్తి ద‌గ్గ‌రున్న పేప‌ర్‌, పెన్నులో ఏదో రాసేశాను. ఆ త‌ర్వాత అవ‌న్నీ జ‌రిగిపోయాయి. అది నాకు మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగింది.
ఇక సుమ‌న్‌తో నా మొద‌టి డ‌బ్బింగ్ మొద‌ల‌యింది. త‌రంగ‌ణిలో ఆయ‌న‌కు డ‌బ్బింగ్‌ చెప్పాను. నా గొంతే హీరో అయింది. ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు చెప్పాను. వీరిద్ద‌రూ నాకు రెండు క‌ళ్ళు. ఆ త‌ర్వాత పోలీస్ స్టోరీ చేశాను. అప్పుడు స్వామివారు చెప్పిన గూడార్థం ఏమిటో అర్థ‌మ‌యింది అని అన్నారు.
న‌టుడు ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ, బాబాగారిపై ఎంతోమంది సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అంజ‌లీదేవిగారు ఓసారి తీద్దామ‌నుకున్నారు. క‌థంతా రెడీ చేసుకున్నారు. ఓ రోజు ఆమెను పిలిచి తీయ‌మ‌న్నారు. అందులోనేను బాబాగారి సోద‌రుడిగా న‌టించాను. అందుకు గ‌డ్డం వుంటే తీశాను. బాబాగారు 13 ఏళ్ళ‌వ‌ర‌కు క‌థ‌ను తీయ‌మ‌న్నారు. అప్ప‌ట్లో 15 ఎపిసోడ్లుగా వ‌చ్చింది. ఇప్పుడు బంగారులాంటి అవ‌కాశం సాయిప్ర‌కాష్‌కు, దామోద‌ర్‌కు వ‌చ్చింది. రెండు భాగాలుగా తీయ‌డం అనేది గొప్ప విష‌యం. ఆయ‌న గురించి చెప్పాలంటే చాలా బాగాలు చెప్ప‌వ‌చ్చు. స్వామివారి భ‌క్తులు దేశ‌దేశాల్లో వున్నారు. బాబాగారికి ట్రాన్ లేష‌న్ చేసే అనిల్‌కుమార్‌గారు ఓసారి త‌ప్పుగా చేస్తే వెంట‌నే ప‌ట్టుకున్నారు. అంత జ్ఞానం వుంది బాబాగారికి. నాకూ ఎన్నో అనుభ‌వాలు వున్నాయి. మొద‌ట్లో న‌మ్మ‌కంలేదు. పెండ్ల‌య్యాక నా భార్య పుట్ట‌ప‌ర్తి తీసుకెళ్ళ‌మంది. చూద్దామంటూ వాయిదా వేశాను. ఓ సారి అనంత‌పూర్ కాలేజీ ఫంక్ష‌న్‌కు నేను హాజ‌ర‌య్యాను. భ‌క్తులంతా నా చుట్టూ కూర్చుకున్నారు. వారినుంచి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాను. పైసా ఖ‌ర్చు లేకుండా చ‌దువు, ఆసుప‌త్రి సౌక‌ర్యాలు ఇవ్వ‌డం దేవుడికే సాధ్యం అని అనిపించింది. అప్పుడు నా మ‌న‌సు మారిపోయింది. స్వామివారే అక్క‌డ ప్ర‌తీ విష‌యంలో కేర్ తీసుకునేవారు. అంజ‌లీదేవిగారు చెప్పిన ఎపిసోడ్ తీస్తున్న‌ప్పుడు నా భార్య‌తో స్వామివారిని క‌లిశాను. మొద‌టిరోజు షూటింగ్‌లో గుమ్మ‌డి, కాంతారావు, రాఘ‌వేంద్ర‌రావు వంటివారు వున్నారు. అప్పుడు స్వామివారు త‌న సోద‌రులు కుటుంబ‌స‌భ్యులుగా మా పాత్ర‌ల‌ను భ‌క్తుల‌కు ప‌రిచ‌యం చేస్తుంటే ఒళ్ళు పుల‌కించింది. నా భార్య‌కూడా ఆశీర్వాదం ల‌భించింది. అప్పుడు ఆమెను చూసి దేనికైనా టైం రావాలి అనే వారు. అప్పుడు బాగారు ఇచ్చిన ఉంగ‌రం ఇప్ప‌టికే పెట్టుకుంటూనే వున్నానంటూ చూపించారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బ్ర‌హ్మారెడ్డి, నిర్మాత‌ రాధామోహ‌న్‌, న‌టి శివ‌పార్వ‌తి మాట్లాడుతూ, బాబాగారితో త‌మ‌కున్న అనుభాల‌ను, అద్భుతాల‌ను, భ‌క్తుల‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు. బాబాపై సినిమా తీయ‌డం చాలా ఆనందంగా వుంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా బాగాగారి గురించి భ‌క్తులు త‌న్మ‌యంతో గానం చేయ‌డం విశేషం.

Related posts

Leave a Comment