ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన

Spread the love

భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం
కళాభవన్‌, రవీంద్రభారతి, సైఫాబాద్‌, హైదరాబాద్‌

విషయం: ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన

  • తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికేట్‌/డిప్లొమా కోర్సుకుగాను (వీణ, హిందూస్థానీ గాత్రం, కర్ణాటిక్‌ గాత్రం, కర్ణాటిక్‌ వయోలిన్‌, పేరిణి నృత్యం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, కథక్‌ నృత్యం, సితార్‌, మృదంగం, నాదస్వరం, డోలు , తబలా, ప్లూట్‌) అడ్మిషన్లను కోరుతున్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందులో చేరటానికి కనీస వయస్సు 10సం॥లు. పూర్తి వివరాల కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చు.
  • ప్రస్తుతం ఉన్న కోవిడ్‌ -19 వ్యాప్తి దృష్ట్యా ఈ కోర్సులన్నింటినీ ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా కూడా అందిస్తున్నాము. ఇప్పటికే ప్రవేశం పొందిన పూర్వ విద్యార్థులు కోరే శాస్త్రీయ సంగీత, నృత్య కోర్సు నిరంతరం అభ్యాసం చేయాల్సి ఉంటుంది కనుక, విద్యార్థులకు, సిలబస్‌కు అంతరాయం కలగకుండా 01 జూలై 2021 నుండి డిజిటల్‌ తరగతులను నిర్వహించబడును.
  • 2021-22 సంవత్సరమునకు ప్రవేశం పొందుటకు ఆసక్తికర అభ్యర్థులు ఆయా కళాశాలలు/ పాఠశాలల్లో ప్రవేశం కోరుటకు ఆయా సంబంధిత కళాశాల / పాఠశాల వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రవేశ దరఖాస్తు ఫారంను పొందవచ్చును. అదేవిధంగా పూర్తి చేసిన దరఖాస్తు కూడా ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేయవలసి ఉంటుంది.
  • కళాశాలలు/పాఠశాలలు – కోర్సు వివరాలు
  • 1) శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: రామకోఠి, హైదరాబాద్‌, ప్రిన్సిపాల్‌(ఎఫ్‌.ఎ.సి), శ్రీ రాఘవరాజ్‌ భట్‌, ఫోన్‌: 9000544874, ఆఫీస్‌ ఫోన్‌: 040-24758090. website: www.stgcmd.com
  • కోర్సు: కర్ణాటిక్‌ గాత్రం, కర్ణాటిక్‌ వయోలిన్‌, మృదంగం, ఫ్లూట్‌, డోలు, హిందూస్థానీ గాత్రం, హిందూస్థానీ వయోలిన్‌, సితార్‌, తబలా, కూచిపూడి నృత్యం, భరతనాట్యం, పేరిణి నృత్యం, కథక్‌ నృత్యం.
  • 2) శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: సికింద్రాబాద్‌, ప్రిన్సిపాల్‌ శ్రీమతి కె. వరలక్ష్మమ్మ, ఫోన్‌: 9849166973, ఆఫీస్‌ ఫోన్‌: 040-27801788 website: www.sbrgcmd.com
  • కోర్సు: కర్ణాటిక్‌ గాత్రం, కర్ణాటిక్‌ వయోలిన్‌, కర్ణాటిక్‌ వీణ, హిందూస్థానీ గాత్రం, మృదంగం, తబలా, కూచిపూడి నృత్యం, పేరిణి నృత్యం.
  • 3) శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: గుడిమల్కాపూర్‌, ఓల్డ్ సిటి హైదరాబాద్‌, ప్రిన్సిపాల్‌ శ్రీ ఎస్‌.రమణమూర్తి, ఫోన్‌: 9703240329, ఆఫీస్‌ ఫోన్‌: 040-23523850. website: www.sancgcmd.com
  • కోర్సు: కర్ణాటిక్‌ గాత్రం, కర్ణాటిక్‌ వయోలిన్‌, హిందూస్థానీ గాత్రం, మృదంగం, తబలా, కూచిపూడి నృత్యం, పేరిణి నృత్యం.
  • 4) విద్యారణ్య ప్రభుత్వ సంగీత కళాశాల: వరంగల్‌, ప్రిన్సిపాల్‌ శ్రీ ఎన్. సుధీర్ కుమార్, ఫోన్‌: 9912288411, ఆఫీస్‌ ఫోన్‌: 0870-2426228. website: www.srividyaranya.com
  • కోర్సు: కర్ణాటిక్‌ గాత్రం, హిందూస్థానీ గాత్రం, మృదంగం, తబలా, సితార్‌, కూచిపూడి నృత్యం, పేరిణి నృత్యం.
  • 5) శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల: నిజామాబాద్‌, ప్రిన్సిపాల్‌, శ్రీమతి యం. సరిత, ఫోన్‌: 9704687023.
  • కోర్సు: కర్ణాటిక్‌ గాత్రం, హిందూస్థానీగాత్రం, కూచిపూడినృత్యం, తబలా, పేరిణినృత్యం. website: www.sgsgsmd.com
  • 6) ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: మంథని, కరీంనగర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీ పాండురంగారావు ముతాలిక్‌, ఫోన్‌: 8008006767, ఆఫీస్‌ ఫోన్‌: 08729-279090.
  • కోర్సు: మృదంగం, పేరిణి నృత్యం.
  • సంచాలకులు

Related posts

Leave a Comment