నవంబర్ 26న వస్తున్న కీర్తి సురేష్ ‘గుడ్‌ల‌క్ స‌ఖి’

Keerthy Suresh’s 'Good Luck Sakhi' Releasing On November 26th
Keerthy Suresh’s 'Good Luck Sakhi' Releasing On November 26th
Spread the love

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గుడ్ లక్ సఖి ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందుతోంది.
కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో కీర్తి సురేష్ తన టార్గెట్‌కు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఆ పోస్టర్‌లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కనిపిస్తున్నారు.
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండ‌గా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు తదిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌