వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, ఒరిజినల్ మూవీస్, డిజిటల్ రిలీజ్లు… ఏవి కావాలన్నా వీక్షకులు ముందుగా చూసే ఓటీటీ వేదిక ‘జీ 5’. ఒక్క హిందీలో మాత్రమే కాదు…తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో ‘జీ 5’ ఉంటే చాలు… వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది.
థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలను సైతం వీక్షకులకు అందిస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ను విడుదల చేసి ప్రజలకు వినోదం అందించింది. ఇప్పుడు దీపావళి కానుకగా సుధీర్ బాబు రీసెంట్ హిట్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ను విడుదల చేయడానికి రెడీ అయ్యింది ‘జీ 5’.
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన విమర్శకులను మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘జీ 5’.
భారతదేశంలో నంబర్ 1 ఓటీటీ ‘జీ 5’లో తమ సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని చిత్రబృందం తెలిపింది.
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాలో పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్హ వర్దన్, సప్తగిరి, కళ్యణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర తారాగణం.
రచన-దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: మణిశర్మ
ప్రోడక్షన్ డిజైనర్: రామకృష్ణ- మౌనిక
కథ: నాగేంద్ర కాశి
కొరియోగ్రాఫర్స్: ప్రేమ్ రక్షిత్, విజయ్ బిన్ని, యశ్వంత్
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కె ఎన్ ఆర్ (నిఖిల్) , రియల్ సతీష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్