‘గుండెక‌థ వింటారా’ చిత్రంలోని ‘ఎంత బావుందో…’ సోల్‌ఫుల్ మెలొడీ పాటికి సూప‌ర్భ్ రెస్పాన్స్‌

gunde katha vintaara telugu movie madhunandhan hero
Spread the love

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఎంత బావుందో...ఫుల్ వీడియో సాంగ్ విడుద‌లై శ్రోత‌ల‌నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంటుంది.
ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా...గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి సాంగ్‌కి మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గుండె క‌థ వింటారా సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కి సిద్ద‌మైంది.
తారాగ‌ణం:
మ‌ధునంద‌న్, స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వంశీధ‌ర్
నిర్మాత‌లు : క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప
బ్యాన‌ర్‌: ట్రినిటి పిక్చర్స్
సినిమాటోగ్ర‌ఫి: ర‌వి వ‌ర్మ‌న్ నీలిమేఘం, సురేష్ భార్గ‌వ్‌
సంగీతం: మ‌సాల కాఫీ
ఎడిట‌ర్‌: సాయి కిర‌ణ్ ముద్దం
యాక్ష‌న్‌: రియ‌ల్ స‌తీష్
కొరియోగ్ర‌ఫి: భాను మాస్ట‌ర్
లిరిక్స్‌: కృష్ణ చైత‌న్య
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: గౌరీ నాయుడు
పిఆర్వో: వంశీ- శేఖ‌ర్

Related posts

Leave a Comment