ఆలేరుకు గొప్ప చరిత్ర ఉంది : ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు

ఆలేరుకు గొప్ప చరిత్ర ఉంది : ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు
Spread the love

టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి

ఆలేరు, జనవరి 16 : యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి ప్రాంత ప్రజలలో స్నేహ భావం మెండుగా ఉంటుందని ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆలేరు ఎస్.టి.ఓ కార్యాలయంలో తనను కలిసిన ఆలేరు ప్రాంత ప్రముఖులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని, వివిధ హోదాల్లో ఈ ప్రాంత వాసులు ప్రాచుర్యం తెచ్చుకుంటున్నారని, ఇది ఎంతో ఆనందించతగ్గ విషయమని ఆయన సంతోషాన్ని వ్యక్తచేశారు. ఈ సందర్బంగా ఆలేరు ఎస్.టి.ఓ కట్టా శ్రీనివాసులుకు సంక్రాంతి, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్బంగా ఆలేరు ఎస్.టి.ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్, తెలంగాణ ఆల్ పెన్షనర్లు అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ యాదాద్రిభువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు బాలరాజు, ఆలేరు ఎస్.టి.ఓ జూనియర్ అసిస్టెంట్ పి. గురునాధ్, ఎస్.టి.ఓ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related posts

Leave a Comment