ఎన్టీఆర్‌ ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్‌…తెరకు పరిచయం చేస్తున్న వైవిఎస్‌ చౌదరి

YVS Chowdhary introducing another NTR from the NTR family
Spread the love

‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న వైవీఎస్‌ చౌదరి ఇప్పటికే పలువురు యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. తాజాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి మరో కొత్త నటుడిని అందరికీ పరిచయం చేస్తున్నాడు. దివంగత సీనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్‌ కుమారుడు) నందమూరి తారక రామారావు ఫస్ట్‌ దర్శన్‌ వీడియోను వైవీఎస్‌ చౌదరి షేర్‌ చేశాడు. ప్రొడక్షన్‌ నంబర్‌ -1 గా రాబోతున్న ఈ చిత్రాన్ని వైవీఎస్‌ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మిస్తుండటం విశేషం.
నందమూరి తారకరామారావు హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫస్ట్‌ దర్శన్‌ వీడియో చెప్పకనే చెబుతోంది. నటుడిగా అందరినీ ఇంప్రెస్‌ చేసేందుకు యాక్టింగ్‌, ఫైట్స్‌లో శిక్షణ తీసుకోవడంతోపాటు మేకోవర్‌ కూడా మార్చుకున్నట్టు తాజా లుక్స్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. చంద్రబోస్‌ పాటలు అందిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజాగా వైవిఎస్‌ చౌదరి ప్రెస్‌ విూట్‌ ఏర్పాటుచేసి ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు. దీంతో ఈ అప్‌కమింగ్‌ హీరోకు సోషల్‌ విూడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అతని ఎంట్రీని స్వాగతిస్తూ .. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ పోస్ట్‌ చేశారు. ‘రామ్‌ సినీ ప్రపంచంలోకి నీ మొదటి అడుగుకు అభినందనలు. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి ఎదురుచూస్తోంది. నువ్వు చేసే ప్రతి ప్రాజెక్ట్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్‌, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల ప్రేమ, ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావనే నమ్మకం ఉంది. నీ భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండాలి మై బాయ్‌’ అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు. ‘డియర్‌ రామ్‌.. నీకు శుభాకాంక్షలు. నువ్వు నీ తొలి సినిమాతోనే అందరూ గర్వపడేలా చేస్తావనే నమ్మకం ఉందని కల్యాణ్‌ రామ్‌ తెలిపారు. ఇక వాగ్దానం, ప్రతిజ్ఞ, ప్యాషన్‌.. సీనియర్‌ ఎన్టీఆర్‌ ఆశీస్సులతో నందమూరి తారక రామారావు ఇండియన్‌ సినిమాలోకి పవర్‌ఫుల్‌ ఎంట్రీ ఇస్తున్నారని వైవీఎస్‌ చౌదరి తెలిపారు.

Related posts

Leave a Comment