దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని హైద్రాబాద్ లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్, శివరాం పల్లి చౌరస్తాలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధు మోహన్ రెడ్డ్డి , రాజేంద్రనగర్ నియోజకవర్గం కన్వీనర్ రాఘవరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ దయానంద్, రాష్ట్ర నాయకుడు సదాల శ్రీనివాస్ రెడ్డి, చైతన్య రెడ్డి, రవీందర్ గౌడ్, జహంగీర్, శానవ్వాజ్, అమీన్ భాయ్, యూనుస్ లు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జీహెచ్ ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, ఆదర్శకాలనీ అంగన్ వాడీ సెంటర్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్బంగా SHAHNAWAZ KHAN (rajendra nagar division president) మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని వైఎస్సార్‌టీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించామని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించుకోడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక మెమోరియల్‌ను కూడా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్ 73వ జయంతి, వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం SHAHNAWAZ KHAN సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ స్మారకార్థం హైదరాబాద్‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ ఘాట్ కోసం ప్రసాద్ ఐమాక్స్ పక్కన 20 ఎకరాల భూమి కేటాయించామన్నారు. ఏడాదిలోగా పను లు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూమిని వెనక్కి తీసుకుని అన్యాయం చేశారు’అని అన్నారు. 2004లో వైఎస్సారే కేసీఆర్‌ను కేంద్రమంత్రిగా, హరీశ్‌రావును రాష్ట్రమంత్రిగా చేశారని గుర్తుచేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి పథకంలోనూ తెలంగాణకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై రైతు ఆవేదన యాత్ర, రైతుగోస దీక్షలు చేపట్టామని చెప్పారు. పోడు పట్టాల కోసం, దళితులు బీసీల కోసం తమ పార్టీ పోరాడిందని, ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్‌టీపీ అని అన్నారు. నిరుద్యోగుల కోసం 31 నిరాహార దీక్షలు చేశామని, ఇంకా చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పోరాటం వల్లే కేసీఆర్‌కు సోయి వచ్చి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ పేరు కోసం పనిచేస్తామని చెబుతున్న దొంగమాటలు నమ్మే వారు ఇక్కడ లేరన్నారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో MR.RAJAGOPAL VAADUKA (telangana state GHMC co-ordinater), A.MOHAN REDDY (r.r district president) , S.RAGHAV REDDY (rajendra nagar constituency incharge), SHAHNAWAZ KHAN (rajendra nagar division president) , MD.TAHER KHAN ( RJNR div minority president) , SALMA BEGUM ( RJNR DIV mahila president) తదితరులు పాల్గొన్నారు.