రష్మికకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ కలిసి రానుందా?

Will the December sentiment come together for Rashmika?
Will the December sentiment come together for Rashmika?
Spread the love

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ కలిసి రానుందా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు ఇదే నెలలో విడుదలై ఘనవిజయం సాధించాయి. రష్మిక తొలి కన్నడ చిత్రం` కిరిక్‌ పార్టీ, తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ డిసెంబర్‌ లోనే విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. చమక్‌ ‘అంజనీ పుత్ర’ లాంటి క్లాసీ చిత్రాలు ఈ ఇయర్‌ ఎండ్‌ సీజన్‌లో విడుదలై ఘనవిజయాలు అందుకున్నాయి. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకులు.. విమర్శకుల నుండి గొప్ప ప్రేమ, ఆదరణ పొందాయి. తదుపరి ‘యానిమల్‌’ (రణబీర్‌- సందీప్‌ వంగా- రష్మిక) డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని గొప్పగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రణబీర్‌ .. రష్మిక మందన పోస్టర్లు జనంలోకి దూసుకెళ్లాయి. యానిమల్‌ డిసెంబర్‌ 5న విడుదలవుతోంది. ఈ విషయం గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ ”డిసెంబర్‌ నెల నాకు ఎప్పుడూ లక్కీ మంత్‌. ‘కిరిక్‌ పార్టీ’తో నా అరంగేట్రం మొదలు పుష్ప, చమక్‌, అంజనీపుత్ర వరకు నాకు అద్భుతమైన విజయాలు వచ్చాయి. ఈ నెలలో విడుదలైన నా సినిమాల న్నింటిపైనా ఇదే నా లవ్‌. డిసెంబర్‌ లో ఇది నా ఐదవ చిత్రం… విడుదల విషయంలో నేను నిజంగా థ్రిల్లింగ్‌ గా ఉన్నాను” అని తెలిపింది. ‘యానిమల్‌’లో తన పాత్ర గురించి హింట్‌ ఇస్తూ ఇంకా చాలా సంగతులే చెప్పింది. ఈ సినిమా గురించి.. నేను చేస్తున్న పాత్ర గురించి ‘ప్రేక్షకులు ఏం చెబుతారో చూడాలని నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది నా కెరీర్‌ లోనే చాలా భిన్నమైన పాత్ర. నేను ఎప్పుడూ ఊహించనిది. నేను ఇంతకు ముందు వైవిధ్యమైన పాత్రలు చేసాను. కానీ ఇది వేరు.. కాబట్టి అభిమానులు విమర్శకులు ఏం చెబుతారో చూడటానికి ఎగ్జయిటింగ్‌ గా వేచి చూస్తున్నాను అని తెలిపింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘పుష్ప: ది రూల్‌’ రెండవ షెడ్యూల్‌ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. దానితో పాటు నాయికా ప్రధాన చిత్రం ` ‘రెయిన్‌బో’ లోను నటిస్తోంది.