శర్వానంద్ హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య లు హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివే..
సంక్రాంతికి గట్టి పోటీ ఉంది కదా? ముందు నుంచే సంక్రాంతి సినిమాగానే రూపొందించారా?
-సంక్రాంతికి సరిపడే మూవీగానే ‘నారీ నారీ నడుమ మురారి’ని రూపొందించాం. ఇదొక పండుగ మూవీ. సినిమాలకు సంక్రాంతి సీజన్ అనేది వర్కౌట్ అవుతుంది. మేం అనుకున్నట్టుగానే సినిమా వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో నాలుగైదు సినిమాలు అనేవి కామన్. సంక్రాంతి సీజన్‌లో రిలీజైన అన్ని చిత్రాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
‘నారీ నారీ నడుమ మురారి’ ఎలా ఉండబోతోంది?
-ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిది. థియేటర్లో కూర్చున్నంత సేపు ఆడియెన్స్‌ని నవ్విస్తాం. బాలయ్య గారితోనే మా టైటిల్‌ను ఓపెన్ చేయించాం. మేం పాటని పూర్తిగా వాడలేదు. కేవలం కొన్ని పదాలనే వాడుకున్నాం.
రిలీజ్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పండి?
-మా మూవీని నైజాం, వైజాగ్‌లో దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌లో సొంతంగా చేస్తున్నాం. వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్‌లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఎన్ని థియేటర్లు అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిర్మాత కూడా చెప్పలేరు.
‘సామజవరగమన’ టైంలోనే డైరెక్టర్‌తో ఈ మూవీని కమిట్ అయ్యారా?
-‘సామజవరగమన’ చేసే టైంలోనే రామ్ అబ్బరాజుతో కమిట్ అయ్యాం. రామ్ అబ్బరాజు నెక్ట్స్ మూవీ కోసం మైత్రి వద్దకు పంపించాను.
ప్రస్తుతం మీరు ఎలాంటి చిత్రాల్ని నిర్మించాలని అనుకుంటున్నారు?
-మేం ఎక్కువగా మహేష్ బాబు గారితో సినిమాలు చేశాం. నేను ప్రస్తుతం చిన్న, పెద్ద చిత్రాలు చేస్తున్నాం. సాయి ధరమ్ తేజ్ గారితోనూ ఓ ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నాం. ప్రయోగాలు ఎందుకు.. ఎంటర్టైన్మెంట్ జానర్‌లోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.
సంక్రాంతి బరిలోకి చివరగా మీరే వస్తున్నారు కదా?
-మేం సంక్రాంతికి వస్తాం అని రెండు నెలల క్రితమే ప్రకటించాం. కానీ చాలా మంది నమ్మలేదు. చాలా మంది ఫోన్స్ చేసి అడిగారు. కానీ మేం చెప్పినట్టుగానే సంక్రాంతికి వస్తున్నాం. ప్రమోషన్స్‌లో పోటీ అని కాదు.. మన కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారు.
సినిమాలో శర్వానంద్ కాకుండా శ్రీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పండి?
=సినిమాలో ఓ మంచి పాత్ర పడింది. ఆ కారెక్టర్‌కి మాకు అందుబాటులో ఉండే హీరో శ్రీ విష్ణు కాబట్టి ఆయన్ను అడిగాం. ఆ పాత్ర వచ్చినప్పుడు థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ కారెక్టర్ ఆద్యంతం నవ్విస్తుంది. వారి కాంబినేషన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఓ పెద్ద హీరో వచ్చి హడావిడి చేసినట్టుగా కాకుండా.. మనలోంచి ఓ సాధారణ మనిషి వచ్చి ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపిస్తుంది.
ఓటీటీ డీల్ గురించి చెప్పండి?
-‘సామజవరగమన’ సినిమా రిలీజ్‌కు ముందు ఏ డీల్స్ జరగలేదు. మీడియాకి వేసిన షో నుంచి పాజిటివ్ టాక్ బయటకు వెళ్లింది. అలా థియేటర్లో ఆ చిత్రం వండర్స్ చేసింది. ఆ తరువాత ఓటీటీ నుంచి, శాటిలైట్ హక్కుల రూపంలో మాకు రెట్టింపు డబ్బు వచ్చింది. ఈ మూవీని అమెజాన్ వాళ్లకు ఇచ్చాం.
పూర్తి స్క్రిప్ట్ ఉంటే తప్ప సెట్స్ మీదకు వెళ్లడం లేదంట కదా?
-స్క్రిప్ట్ బాగుంటే.. సినిమా కూడా బాగుంటుంది. స్క్రిప్ట్ లెవెల్లోనే మనం అన్నీ చూసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అయ్యాక ఓ సారి చూసుకుంటాను. చివరి షెడ్యూల్ టైంలో మళ్లీ ఓో సారి చూసుకుంటాను. స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే బాగున్నట్టే. మంచి స్క్రిప్ట్‌తో వస్తేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.
భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
-సాయి ధరమ్ తేజ్‌తో, తేజ సజ్జాతో సినిమాలు చేయబోతోన్నాను. అడివి శేష్‌తో ‘గూఢచారి 2’ రాబోతోంది. ఎక్కువగా వినోదాత్మక చిత్రాల్ని చేయాలని అనుకుంటున్నాను. ఈ క్రమంలోనే ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్‌ను చేస్తున్నాను.
వినోదాత్మక చిత్రాల్నే నిర్మించాలనుకుంటున్నాం : నిర్మాత అనిల్ సుంకర
