అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత, నటుడు లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
* ‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా ఇది దమ్మున్న సినిమా . ఈ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది . ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా క్లిన్ ఫామిలీ ఎంతటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు సుమన్ అందరి హృదయాలను వెలుచుకుంటారు. సుమన్ గారు ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇందులో ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తారు.
* సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు.
* మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్. సుమన్ గారు ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డివోపీ వినోద్, కుమార్ సహా టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 4న ప్రేక్షకులముందుకు రాబోతున్న మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా.
* చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని కాకుండా కంటెంట్ చూడాలి. తెలుగు వాళ్లం మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటేనే మనం ప్రూవ్ చేసుకుంటాం. ఈ సినిమాలో చాలా దమ్ము ఉంది. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
* ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటు కథ, మాటలు, పాటలు, రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించారు దర్శకుడు యుద్ధనపూడి మైకిల్. కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం. కానీ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కష్టపడితే ప్రతి ఒక్కరికీ సక్సెస్ వస్తుంది. పాజిటివ్ వైబ్ ఉండే టైటిల్, పాజిటివ్ వైబ్ ఉన్న కథ ఇది. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందిస్తాం.
ఈ సినిమా కోసం మేం పడ్డ కస్టమ అంతా ఇంతా కాదు. దాదాపు14 నెలలు ఈ సినిమాతో జర్నీ చేశాం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అవన్నీ దాటుకుని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. శ్రీరామ్, హీరోయిన్ స్వాతి కూడా చాలా బాగా సహకరించారు. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఆమె మాకు సహకరించారు.
* అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ లపై తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి పాత్రలు అందరికీ నచ్చుతాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, నాగ మహేష్, సమ్మెట గాంధీ, బాహుబలి ప్రభాకర్, అనుముల లక్ష్మణరావు, ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : వినోద్, మ్యూజిక్ డైరెక్టర్ : మనీష్ కుమార్ , దర్శకుడు : యుద్ధనపూడి మైకిల్ , నిర్మాతలు : అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు.
‘మా రాముడు అందరివాడు ’ విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాం : నిర్మాత, నటుడు లక్ష్మణరావు ఇంటర్వ్యూ…
