‘విష్ణు విన్యాసం’ తొలి వీకెండ్‌లో రూ.14.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..

'Vishnu Vinyasam' grosses Rs. 14.7 crores in its first weekend..
Spread the love

>కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విష్ణు విన్యాసం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్ స్థిరంగా పెరుగుతూ వచ్చిన ఈ సినిమా మంచి పబ్లిక్ టాక్‌తో స్ట్రాంగ్ కమర్షియల్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. మొదటి రెండు రోజుల్లోనే మంచి గ్రోత్ నమోదు చేసిన ఈ చిత్రం, మూడో రోజునే రూ.5.6 కోట్ల గ్రాస్ సాధించింది. వరల్డ్‌వైడ్ తొలి వీకెండ్ కలెక్షన్స్ రూ.14.7 కోట్లకు చేరాయి. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ పబ్లిక్ టాక్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. క్లీన్ హ్యూమర్, భావోద్వేగాలు, రీలేటబుల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువత ఫన్ ఎలిమెంట్స్‌ను ఆస్వాదిస్తుండగా, కుటుంబ ప్రేక్షకులు కథలోని ఎమోషన్ ని  మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా అంతటా వస్తున్న పాజిటివ్ టాక్, ప్రధాన కేంద్రాల్లో కనిపిస్తున్న మంచి ఫుట్‌ఫాల్స్ ఈ సినిమాకు బలమైన కనెక్షన్ ఏర్పడిందని సూచిస్తున్నాయి. మొదటి వర్కింగ్ డే ట్రెండ్స్ కూడా ఉత్సాహాన్నిస్తున్నాయి. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో మంచి బుకింగ్స్ నమోదవుతుండగా, నాలుగో రోజుకూడా సినిమా బలంగా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో అలరించే శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ఆ బ్రాండ్‌ను మరింత స్ట్రాంగ్ చేశారు. దర్శకుడు యదునాథ్ మారుతి రావు అందించిన ఫ్రెష్, ఎంగేజింగ్ ట్రీట్‌మెంట్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి, సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం మొదటి వారం కూడా బలంగా కొనసాగుతూ, ట్రూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.

Related posts